స్టార్ హీరో కూతురి పై నెటిజెన్ల ట్రోలింగ్.. కారణం అదే..!
December 23, 2022 / 12:45 PM IST
|Follow Us
జనాలకు సెలబ్రిటీలు అంటే ఓ క్రేజీ ఫీలింగ్. ముఖ్యంగా సినీ సెలబ్రటీలను చాలా పర్సనల్ గా ఫీలవుతూ ఉంటారు. వారికి ఇష్టమైన నటుడు లేదా నటి.. కోసం నచ్చని/పోటీదారులైన నటీనటులను ట్రోల్ చేయడం, వారి సినిమాల పై కూడా నెగిటివ్ కామెంట్లు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ట్విట్టర్ వార్లు వగైరా వంటివి దేశవ్యాప్తంగా ట్రెండ్ అవ్వడానికి ఇవే కారణంగా చెప్పుకోవచ్చు. ఇది పక్కన పెడితే.. ఒక్కోసారి నచ్చిన సెలబ్రిటీలను కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది.కొంతమంది అయితే ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మరీ సెలబ్రిటీలను అదే పనిగా ట్రోల్ చేస్తుంటారు.సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. షారుఖ్ కూతురు అయిన సుహానా ఖాన్ ను సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి సుపరిచితమే . ఇప్పుడు ఈమె పై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతుంది. ఎటువంటి కారణం లేకుండానే ఆమె ట్రోలింగ్ జరుగుతుంది. మేటర్ లోకి వెళ్తే… సుహానా ‘ద ఆర్చీస్’ అనే చిత్రంతో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్తయ్యింది. కాబట్టి చిత్ర బృందం ఓ చిన్న పార్టీని ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి ఆమె రెడ్ కలర్ టైట్ డ్రెస్లో వచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలే ఆమెను ట్రోల్ చేయడానికి కారణమయ్యాయి. ‘మలైకా అరోరాలా నడుస్తూ ఎందుకంత బిల్డప్ ఇస్తున్నావు?’, ‘అబ్బా, నీ మొహం చూడలేకపోతున్నాం, ‘ఏం తల్లీ.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నావా?’,
అంటూ నెగిటివ్ కామెంట్లతో ఆమెపై విరుచుకుపడుతున్నారు. ‘ఈ ట్రోలింగ్ ఎవరో కావాలని చేయిస్తున్నారు.వట్టి పుణ్యానికి సుహానా పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. రాణించడం కొంతమంది హీరోయిన్లకు ఇష్టం లేదేమో అందుకే ఇలా డబ్బులిచ్చి ట్రోల్ చేయిస్తున్నారు’ అంటూ షారుఖ్ అభిమానులు సుహానాని ట్రోల్ చేసే వారిపై మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ టాపిక్ మరింతగా ట్రెండ్ అవుతుంది.