గ్లామరస్ గా లేకపోతే ఒక బాధ.. గ్లామర్ షో చేస్తే మరో బాధ
November 12, 2019 / 01:37 PM IST
|Follow Us
ఈ హీరోయిన్ల పరిస్థితి ఈమధ్య మరీ దారుణంగా తయారైంది. వాళ్ళేం చేసిన ట్రోల్ చేయడం నెటిజన్లకు కామన్ అయిపోయింది. ఈ ట్రోలింగ్ కి ఇటీవల రష్మిక, నివేదా థామస్ బాధపడిన విషయం ఇన్స్టాగ్రామ్ లో చూశాం. ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది. “సైరా”లో పోషించిన లక్ష్మి పాత్రకు తమన్నాను నెటిజన్లు తెగ పొగిడేసిన జనం ఆమె రీసెంట్ ఫోటోషూట్ ను మాత్రం తిట్టిపోస్తున్నారు. నిన్నమొన్నటివరకు తన నడుమందాలను మాత్రమే చూపిస్తూ కుర్రాళ్లను ఊరించిన తమన్నా రీసెంట్ ఫోటోషూట్ లో మాత్రం తన యద అందాలను చూపి మరింత వేడెక్కించాలనుకొంది.
అయితే.. తమన్నా యద సంపద కాస్త తక్కువనే చెప్పాలి. ఈ విషయమై ఆమెను నెటిజన్లు కాస్త దిగజారిన పద్ధతిలో ట్రోల్ చేస్తున్నారు. అవసరమా తమన్నా అని కామెంట్లు చేస్తున్నారు. ఎప్పట్లానే తమన్నా ఈ విషయాలను ఇగ్నోర్ చేసినప్పటికీ.. స్నేహితుల దగ్గర మాత్రం బాధపడినట్లు తెలిసింది.