Arohi Rao: నామినేషన్స్ లో బిగ్ బాస్ అద్దిరిపోయే ట్విస్ట్..! షాకైన హౌస్ మేట్స్..!

  • September 8, 2022 / 11:44 AM IST

 బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ వీక్ ఎప్పుడూ ఊహించని విధంగా అయ్యాయి. ఎప్పుడూ ఫస్ట్ డేనే నామినేషన్స్ పెట్టే బిగ్ బాస్ ఈసారి హౌస్ మేట్స్ తో ఒక ఆట ఆడుకున్నాడు. క్లాస్, మాస్, ట్రాష్ అని హౌస్ మేట్స్ ని డివైడ్ చేస్తూ వారితో ఛాలెంజస్ ఆడించాడు. రెండురోజులు గేమ్స్ , టాస్క్ లు ఆడిన హౌస్ మేట్స్ ఎట్టకేలకి మూడోరోజు నామినేషన్స్ ని ముగించారు. క్లాస్ టీమ్ లో నేహా చౌదరి, ఆదిరెడ్డి, గీతురాయల్ ముగ్గురు సేఫ్ అయ్యారు. ఇక ట్రాష్ టీమ్ లో అభినయశ్రీ, బాలాదిత్య, ఇంకా ఇనయా సుల్తానాలు మిగిలిపోయారు.

మిగిలిన మాస్ టీమ్ లోనే నేరుగా నామినేషన్స్ ప్రక్రియని జరిపాడు బిగ్ బాస్. ఒకొక్కరిని పిలుస్తూ ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పాడు. అంతేకాదు, మెరీనా ఇంకా రోహిత్ ఇద్దరూ కపుల్ గానే ఎంట్రీ ఇచ్చారని, వారిలో ఒకర్ని నామినేట్ చేస్తే ఇద్దరినీ చేసినట్లే అవుతుందని, ఒకవేళ ఎలిమినేషన్ అయినా కూడా ఇద్దరూ ఒకేసారి వెళ్లిపోతారని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ ఈ కపుల్ ని నామినేట్ చేయడానికి ఇష్టపడలేదు. మాస్ టీమ్ లో అత్యధికంగా రేవంత్ ని టార్గెట్ చేశారు. ఏకంగా ఏడుగురు హౌస్ మేట్స్ రేవంత్ ని నామినేట్ చేశారు.

చంటికి ఐదు ఓట్లు, శ్రీసత్యకి నాలుగు ఓట్లు పడ్డాయి. ఫైమాకి కూడా మూడు ఓట్లు పడ్డాయి. ఇక్కడే బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. క్లాస్ టీమ్ లో ఉన్న ముగ్గురికి ప్రత్యేకమైన పవర్ ఇచ్చి ట్రాష్ లోని ఒకరిని సేవ్ చేయమని, మాస్ లో నామినేషన్స్ లో లేనివారితో స్వాప్ చేయమని చెప్పాడు. దీంతో క్లాస్ టీమ్ షాక్ అయ్యింది. చాలాసేపు చర్చలు జరిపింది. ఆదిరెడ్డి ఇనయా సుల్తానాని తప్ప ఎవరినైనా సేవ్ చేయమని చెప్పాడు. ముగ్గురూ ఏకాభిప్రాయంతో బాలాదిత్యని సేవ్ చేశారు.

అంతేకాదు, ఆరోహితో బాలాదిత్యని స్వాప్ చేశారు. దీంతో అనూహ్యంగా ఆరోహిరావ్ నామినేషన్స్ లోకి రావాల్సి వచ్చింది. నిజానికి ఆరోహి రావ్ ని రేవంత్, ఇంకా అర్జున్ కళ్యాణ్ ఇద్దరూ నామినేట్ చేశారు. కేవలం రెండు ఓట్లు వచ్చాయి కాబట్టి సేఫ్ జోన్ లో ఉన్న ఆరోహి రావ్, క్లాస్ టీమ్ స్వాప్ చేయడంతో నామినేషన్స్ లోకి వచ్చేసింది. ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో ఇప్పుడు ఏడుగురు ఉన్నారు.

రేవంత్, చంటి, ఇనయసుల్తానా, అభినయశ్రీ, శ్రీసత్య,ఫైమా, ఇంకా ఆరోహిరావ్ లు ఉన్నారు. వసంతీకృష్ణన్ మాత్రం కేవలం రెండు ఓట్లు రావడం వల్ల సేఫ్ అయిపోయింది. ఇంకో ఓటు పడి ఉంటే తను కూడా ఫస్ట్ వీక్ నామినేషన్స్ లోకి వచ్చేది. లాస్ట్ మినిట్ లో బిగ్ బాస్ ఇచ్చిన ట్వస్ట్ వల్ల బాలాదిత్య నామినేషన్స్ నుంచీ సురక్షితుడు అయ్యాడు. మరి ఈవారం వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాలి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus