BRO Movie: బ్రో టీజర్ వ్యూస్ విషయంలో రికార్డులు సృష్టించనుందా?

  • June 13, 2023 / 12:54 AM IST

పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో సముద్రఖని డైరెక్షన్ లో తెరకెక్కిన బ్రో మూవీ జులై నెల 28వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ కు కేవలం ఆరు వారాల సమయం మాత్రమే ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సముద్రఖని మాట్లాడుతూ బ్రో మూవీ టీజర్ కు సంబంధించి షాకింగ్ అప్ డేట్ ఇవ్వగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. బ్రో మూవీ టీజర్ సిద్ధమవుతోందని అతి త్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుందని ఆయన షాకింగ్ అప్ డేట్ ఇచ్చారు.

వినోదాయ సిత్తం మూవీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కగా టీజర్ రికార్డులు సృష్టించడంతో పాటు రికార్డులు తిరగరాయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బ్రో మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ మూవీ స్క్రిప్ట్ లో మార్పులు చేశారని తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేశారని వినోదాయ సిత్తం చూసిన వాళ్లకు సైతం ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బ్రో మూవీకి (BRO) రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటు హరిహర వీరమల్లులో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి పవన్ నటిస్తున్న సినిమాలు అన్నీ విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ పారితోషికం భారీ రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ ను చూసి ఇతర హీరోలను చూసి షాకవుతున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus