Vikram: ఆ సినిమాతో విక్రమ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరుతుందా?

  • October 21, 2023 / 03:19 PM IST

కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి కలెక్షన్లను సాధించడంతో పాటు ఊహించని స్థాయిలో రికార్డులను సొంతం చేసుకున్నాయి. అయితే కేజీఎఫ్ బ్యాక్ డ్రాప్ లో విక్రమ్ కొత్త మూవీ తెరకెక్కుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. సిద్దార్థ్ చిన్నా సినిమాతో ప్రశంసలు అందుకున్న అరుణ్ కుమార్ విక్రమ్ తర్వాత మూవీకి డైరెక్టర్ అని భోగట్టా.

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ విధంగా (Vikram) విక్రమ్ కొత్త సినిమాకు కేజీఎఫ్ కనెక్షన్ ఉందని తెలుస్తోంది. పొన్నియిన్ సెల్వన్1, పొన్నియిన్ సెల్వన్2 సినిమాలతో విక్రమ్ ఈ మధ్య కాలంలో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. అపరిచితుడు తర్వాత సోలో హీరోగా విక్రమ్ నటించిన సినిమాలేవీ మరీ బ్లాక్ బస్టర్ హిట్లు కాదు. తన సినిమాల కోసం విక్రమ్ ఎంతో కష్టపడుతున్నా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం పూర్తిస్థాయిలో దక్కడం లేదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

విక్రమ్ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రం తిరుగుండదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. విక్రమ్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 57 సంవత్సరాల వయస్సులో సైతం విక్రమ్ కెరీర్ పరంగా కష్టపడుతున్న తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సైతం (Vikram) విక్రమ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో విక్రమ్ మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విక్రమ్ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు. రాబోయే రోజుల్లో తన సినిమాలతో విక్రమ్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus