Radhe Shyam: విక్రమాదిత్య పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ ఫాక్స్..!

  • October 26, 2021 / 09:00 AM IST

‘రాధేశ్యామ్’.. గురించి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా అభిమానులను వెయిట్ చేయించిన నిర్మాతలు మొత్తానికి మొన్న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఓ టీజర్ ను విడుదల చేశారు. ఇందులో విక్రమాదిత్య అనే ఓ పాత్రని ప్రభాస్ పోషిస్తున్నాడు. ఆ పాత్రని పరిచయం చేస్తూ టీజర్ ను వదిలారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. సినిమా పై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ప్రభాస్ పామిస్ట్ అన్నట్టు ఈ టీజర్ లో చూపించారు.

అయితే ‘నా పేరు విక్రమాదిత్య…నేను దేవుడిని కాదు. అలాగని మీలో ఒకడిని కూడా కాదు’ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ అనేక ఊహాగానాలకు తెరలేపింది! అంతేకాదు కొంతమంది ప్రభాస్ సాధారణ మనిషి కాదు… మరో గ్రహం నుండి భూమి మీదకి వచ్చిన గ్రహాంతర వాసి’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వారి అంచనా ప్రకారం.. ” ‘రాధేశ్యామ్’ లో ప్రభాస్ వేరే గ్రహం నుండి భూమి పైకి వస్తాడట. దాంతో విక్రమ్ ఆదిత్యకి మన ఫ్యూచర్ అంతా పాస్ట్ అట. ఇలాంటి పాత్రలు ఎక్కువగా మార్వెల్ వారి సినిమాల్లో, సింగీతం గారి సినిమాల్లో కనిపిస్తాయి.

అయితే భవిష్యత్ చెప్పగలడు కానీ ఆ రాతని మాత్రం ఇతను మార్చలేడు. ఇదే క్రమంలో ఓ ఇటలీలో అమ్మాయితో అతను ప్రేమలో పడతాడు. కానీ.., ఆమె ఎదొర్కొంటున్న సమస్యల కారణంగా…. ఆమెకు మరణం సంభవిస్తుంది! ఈ విషయం ముందుగా తెలిసినా విక్రమాదిత్య ఏమీ చేయలేడు. కనీసం ఈ విషయాలని ఆమెకు తెలియజేయలేడు కూడా..! ఈ క్రమంలో ఆమె కోసం అతను ఏం చేయగలడు… ఆమెను రక్షించుకోగలడా లేక దూరమైపోతాడా?” అనేది మిగిలిన కథ అంట. ఇక ఇందులో ప్రభాస్ రెండు రకాల పాత్రల్లో కనిపించబోతున్నాడు. మరి రెండో పాత్ర ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus