Salaar: బాహుబలి2 సినిమాను మించి ఉండబోతున్న సలార్.. ఏం జరిగిందంటే?

  • July 11, 2023 / 08:08 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సలార్ పార్ట్1 సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా 113 మిలియన్ల వ్యూస్ తో ఈ టీజర్ సంచలనం సృష్టించింది. సలార్ మూవీ గురించి, ఈ సినిమా కథ, ట్విస్టుల గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. అయితే జక్కన్న సినిమాలను మించి సలార్ ఉండబోతుందని భోగట్టా. బాహుబలి2 సినిమాను మించి సలార్ మూవీ ఉండబోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా విషయంలో ఎలాంటి టెన్షన్ అవసరం లేదని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం అందుతోంది. బాహుబలి2, ఆర్.ఆర్.ఆర్ సినిమాలను మించి సలార్ సినిమాకు బిజినెస్ జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సలార్ సినిమాతో ప్రేక్షకుల నమ్మకాన్ని మరోసారి ప్రభాస్, ప్రశాంత్ నీల్ పొందుతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సలార్ (Salaar) మూవీ రిలీజ్ కు ముందు, రిలీజ్ కు తర్వాత సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యకమవుతున్నాయి. ప్రభాస్ గత సినిమాలు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోకపోయినా సలార్ మాత్రం అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ పార్ట్1 విడుదలైన రోజునే సలార్ మూవీ పార్ట్2 కు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సలార్ ట్రైలర్ లో అయినా శృతి హాసన్ కు తగిన ప్రాధాన్యత దక్కాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమా ఎంతమంది జాతకాన్ని మారుస్తుందో చూడాల్సి ఉంది. సలార్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది. సలార్ సినిమాలో యాక్షన్ సీన్లు గూస్ బంప్స్ వచ్చేలా ఉండనున్నాయని తెలుస్తోంది. సలార్ ను మించి సలార్2 రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus