భీభత్సమైన ట్రోలింగ్ అనంతరం ప్రభాస్ ను పొగిడిన శ్రద్ధకపూర్!

  • October 9, 2019 / 01:20 PM IST

“సాహో” సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దకపూర్ కి తెలుగులో ఆశించిన స్థాయి విజయం దక్కకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం “సాహో, చిచోరే” లాంటి సినిమాలతో వరుస విజయాలు అందుకొని విశేషమైన స్టార్ డమ్ ను దక్కించుకొంది. అయితే.. మొన్నామధ్య ఒక టీవీ రిపోర్టర్ ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ ప్రభాస్ తో వర్క్ చేయడం గురించి, సాహో సినిమా ఎక్స్ పీరియన్స్ గురించి ఒకటికి రెండుసార్లు అడిగినా శ్రద్ధకపూర్ కావాలని క్వశ్చన్స్ ను ఇగ్నోర్ చేయడం పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఆమెకు గుర్రుమన్నారు. ఆమెను ట్విట్టర్ లో భారీస్థాయిలో ట్రోలింగ్ కూడా చేశారు. మరి ట్రోలింగ్ కు భయపడిందో లేక తాను భవిష్యత్ తో తెలుగు సినిమాలు చేయాలంటే కష్టం అనుకుందో తెలియదు కానీ.. ఇటీవల కొన్ని మీడియా సంస్థలను ఇచ్చిన మీడియా ఇంటర్వ్యూల్లో ప్రభాస్ మీద ప్రశంసల వర్షం కురిపించింది.

ముఖ్యంగా.. ప్రభాస్ తనకు సౌత్ ఇండియన్ ఫుడ్ ఐటెంస్ ను పరిచయం చేసిన విధానం, షూటింగ్ టైమ్ లో తనను సాహో టీం అందరు ఎంతో ప్రత్యేకంగా ట్రీట్ చేసిన విధానం మాత్రం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకొంది, అందుకే నాకు సౌత్ సినిమాలన్నా, ప్రభాస్ అన్నా చాలా ఇష్టం అని తెగ పొగిడేసింది. మరి ఇంతలా పొగుడుతుంది అంటే తెలుగు నుంచి లేదా తమిళం నుంచి ఏదైనా మంచి ఆఫర్ వచ్చిందో ఏమో అని అనుమానపడుతున్నారు అభిమానులు.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus