Shraddha Kapoor: ఆ విషయంలో క్లారిటీ లేదన్న శ్రద్ధా కపూర్!
June 14, 2022 / 12:59 PM IST
|Follow Us
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ కు ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. సాహో సినిమా ద్వారా శ్రద్ధా కపూర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సాధారణంగా శ్రద్ధా కపూర్ వివాదాలకు దూరంగా ఉంటారని ఇండస్ట్రీలో పేరుంది. అయితే శ్రద్ధా కపూర్ సోదరుడు చేసిన తప్పు వల్ల తాజాగా వార్తల్లో నిలిచారు. శ్రద్ధా కపూర్ సోదరుడి పేరు సిద్ధాంత్ కపూర్ కాగా ఇతను తాజాగా ఒక కేసులో చిక్కుకున్నారనే సంగతి తెలిసిందే.
బెంగళూరులోని ప్రముఖ హోటల్ లో జరిగిన రేవ్ పార్టీకి హాజరైన సిద్ధాంత్ కపూర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు మరో ఐదుగురిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే సోదరుడి అరెస్ట్ గురించి శ్రద్ధాకపూర్ ను మీడియా ప్రశ్నించగా మీడియా వెల్లడించిన విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాను ఉదయం నిద్ర లేచిన సమయంలో టీవీలో సిద్ధాంత్ కపూర్ ను అరెస్ట్ చేశారనే వార్తను చూశానని ఆమె చెప్పుకొచ్చారు.
ఆ సమయంలోనే తన సోదరుడు అరెస్ట్ అయ్యాడని తనకు తెలిసిందని ఆమె చెప్పుకొచ్చారు. తన సోదరుడు అరెస్ట్ కావడం గురించి తనకు ఏమీ తెలియదని ఆమె అన్నారు. మా కుటుంబం మొత్తం సిద్ధాంత్ అరెస్ట్ కు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని ప్రయత్నిస్తోందని అయితే ఎలాంటి ఫలితం లేదని శ్రద్ధా కపూర్ కామెంట్లు చేశారు. తాను కాల్ చేసినా అవతలి వ్యక్తులు ఫోన్ కాల్స్ కు స్పందించడం లేదని ఆమె పేర్కొన్నారు.
తన సోదరుడి అరెస్ట్ విషయంలో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని శ్రద్ధా కపూర్ చెప్పుకొచ్చారు. శ్రద్ధా కపూర్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రద్ధా కపూర్ సోదరుడు స్పందిస్తే మాత్రమే అసలేం జరిగిందో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శ్రద్ధా కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. శ్రద్ధా కపూర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.