Adipurush: ‘ఆదిపురుష్’ ప్రచారంలో కీలకంగా మారుతున్న ఉచితాలు… ఈసారి ఎవరికంటే?
June 14, 2023 / 12:53 AM IST
|Follow Us
‘ఆదిపురుష్’ సినిమాపై మీ అభిప్రాయం ఏంటి? అని కొన్ని రోజుల క్రితం ఏ అభిమానిని అడిగినా, ఏ సినిమా ప్రేక్షకుడిని అడిగానా ‘అబ్బే’ అనేవారు. అంతలా సినిమా జనాల మధ్యలో బ్యాడ్ అయిపోయింది. గ్రాఫిక్స్, సినిమా చూపించే విధానం మీద విమర్శలు రావడం లాంటివి దీనికి కారణం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమా రిలీజ్‌కి ఇంకా వారం కూడా లేకపోవడంతో టీమ్ ప్రచారం జోరు పెంచింది. అలాగే జనాల ఆలోచన కూడా మారుతోంది. అయితే ఈ క్రమంలో ఓ విషయం ప్రధానంగా నిలుస్తోంది. అదే ఉచితం.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఉచితం అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రమే కనిపించేవి. రకరకాల పథకాలు పెట్టినా.. అన్నింటికి ఉచితం అనే కాన్సెప్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా విషయంలోనూ అంతే అని చెప్పొచ్చు. ఇప్పటికే రెండు ఉచితాలు బయటకు రాగా, ఇప్పుడు మూడో ఉచితం బయటకు వచ్చింది. ఈసారి ఓ జిల్లా మొత్తంలో ఉచితంగా టికెట్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆ జిల్లా రాములోరి సొంత ప్రాంతంగా భావించే ఖమ్మం జిల్లా.
ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించిన చారిత్రక గాథ ‘ఆదిపురుష్’. ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది. ఈ క్రమంలో రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటా హనుమంతుల వారు ఉంటారు అనే నమ్మకంతో ‘ఆదిపురుష్’ సినిమా థియేటర్లో ఒక సీటుని ఆంజనేయుడి కోసం ఖాళీగా ఉంచాలని చిత్రబృందం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అభిషేక్ అగర్వాల్ కూడా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలు, అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలకు పది వేల టికెట్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు.
ఇప్పుడు ఈ మంచి కార్యాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రేయస్ మీడియా ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో, ప్రతి రామాలయానికి ఉచితంగా 101 టికెట్లు ఇస్తామని ప్రకటించింది. సొంత డబ్బులతో ఈ టికెట్లు కొని ఇస్తారట. మరోవైపు రామ్‌చరణ్, రణ్‌బీర్ కపూర్ లాంటి వాళ్లు కూడా ఈ సినిమా టికెట్లు కొని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారని టాక్. చూస్తుంటే సినిమా టికెట్లు ఇలానే ఎక్కవ తెగేలా ఉన్నాయనే జోకు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది.