Shruti Haasan: శృతిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారా..?

  • April 7, 2021 / 09:52 PM IST

కమల్ హాసన్ కూతురుగా, స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో శృతిహాసన్ పేరు, గుర్తింపును సంపాదించుకున్నారు. నిన్న తమిళనాడు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శృతిహాసన్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్నికల అనంతరం చేసిన ఒక చిన్న పొరపాటు శృతిహాసన్ కు కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఎన్నికల అనంతరం కమల్ హాసన్ తో కలిసి శృతి కమల్ పోటీ చేస్తున్న పోలింగ్ బూత్ లోకి వెళ్లారు. సాధారణంగా ఎన్నికల రూల్స్ ప్రకారం పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవాళ్లు, పోలింజ్ ఏజెంట్లు, మీడియా వ్యక్తులు మాత్రమే పోలింగ్ బూత్ లోకి వెళ్లే అవకశం ఉంటుంది.

శృతి హాసన్ కు ఎటువంటి గుర్తింపు లేకపోయినా ఆమె పోలింగ్ బూత్ లోకి వెళ్లడంపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. బీజేపీ నేతలు ఇప్పటికే ఎన్నికల అధికారికి శృతిపై ఫిర్యాదు చేయగా అధికారి ఫిర్యాదు విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హసన్ కోయంబత్తూర్‌ నుంచి పోటీ చేశారు. శృతి గురించి బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

బీజేపీ నేతల ఫిర్యాదు పట్ల శృతి స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది. క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు కోరుతున్న నేపథ్యంలో ఎన్నికల అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. శృతి ఎన్నికల్లో ఓటు వేసిన తరువాత ట్విట్టర్ ద్వారా తన తండ్రి పార్టీ అయిన మక్కల్ నీది మయ్యంకు ఓటు వేయమని చెప్పడం కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనలను ఉల్లంఘించడమేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. శృతి హాసన్ తప్పు మీద తప్పు చేశారని బీజేపీ నేతలు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus