తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ హోదా అందుకున్న శృతిహాసన్.. బాలీవుడ్ మీద ఇంట్రెస్ట్ తో అక్కడికి వెళ్లి ప్రయత్నాలు మొదలెట్టింది. మొదట్లో రెండు, మూడు అవకాశాలు వచ్చినా.. ఆ తరువాత ఈమెని లైట్ తీసుకున్నారు బాలీవుడ్ మేకర్స్. దీంతో తిరిగి టాలీవుడ్ కి వచ్చి సినిమాలతో బిజీ అయింది. రీసెంట్ గా ‘క్రాక్’ తో హిట్ అందుకుంది. ఇప్పుడు ‘సలార్’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో నటించడానికి సైన్ చేసింది. అలానే త్వరలోనే రిలీజ్ కాబోతున్న ‘వకీల్ సాబ్’ లో హీరోయిన్ గా కనిపించనుంది.
ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ లాక్ డౌన్ సమయంలో స్టోరీ లైన్స్ రాసుకుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇప్పుడు ఆ కథలను.. స్క్రీన్ ప్లే రూపంలోకి మార్చే పని మొదలుపెట్టింది. పదిహేనేళ్ల వయసు నుండే కవితలు, పాటలు రాయడం శృతిహాసన్ కి అలవాటు. కానీ స్క్రిప్ట్ రైటింగ్ అనేది మాత్రం ఎప్పుడూ ప్రయత్నించలేదు. లాక్ డౌన్ సమయాన్ని దానికోసం ఉపయోగించుకొని.. కొన్ని స్టోరీ లైన్స్ రాసుకొని పెట్టుకుంది.
ఇప్పుడు వాటినే స్క్రిప్ట్స్ గా మారుస్తున్నట్లు వెల్లడించింది. స్క్రిప్ట్ రేటింగ్ అనేది తనకు మానసిక ఉల్లాసాన్ని అందిస్తోందని చెప్పింది. పాటలు, కథలు రాయడంలో కొన్నేళ్లుగా తన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్నానని.. ఇప్పుడు అది బాగా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చింది శృతి. అయితే తను రాసుకున్న స్క్రిప్ట్ కి తనే డైరెక్టర్ గా వర్క్ చేస్తుందా లేక మరో డైరెక్టర్ చేతిలో స్క్రిప్ట్ పెడుతుందా అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది!