దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శృతీ హాసన్…బాయ్ ఫ్రెండ్ ఫోటో వైరల్..!

  • January 29, 2021 / 01:07 PM IST

ఈ మధ్యనే ‘క్రాక్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న శృతి హాసన్ వరుసగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. కొన్నేళ్ల క్రితం ఇంగ్లండ్ సింగర్ అయిన మైకేల్ కోర్స‌లేతో ప్రేమాయణం నడిపింది శృతీ. అతన్నిపెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయింది.ఆమె తండ్రి కమల్ హాసన్ కూడా వీరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది.

సమయంలోనే శృతి – మైకేల్ పెళ్లి జరగబోతుందని అంతా అనుకున్నారు. కానీ,అయితే అనూహ్యంగా వీళ్లిద్దరూ బ్రేకప్ అయిపోయారు. ఇదిలా ఉంటే.. నాలుగు రోజుల క్రితం సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన శృతీ తాను మళ్ళీ ప్రేమలో పడినట్టు హింట్ ఇచ్చింది. ఇక నిన్న తన కొత్త బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసి అందరికీ షాకిచ్చిందనే చెప్పాలి. ఈమె కొత్త బాయ్ ఫ్రెండ్ పేరు శంతను. ఇతనొక ఇండిపెండెంట్ ర్యాపర్ అలాగే ఇల్యూస్ట్రేటర్ గా కెరీర్ ని సాగిస్తున్నాడు.

శ్రుతికి మ్యూజిక్ బ్యాండ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి.. కొద్దిరోజుల క్రితం ఇతనితో పరిచయం ఏర్పడిందని తెలుస్తుంది.ఇతను రొనాల్డినోలా.. బెక్ హాంలా యమ హాట్ గా ఉన్నాడంటూ కొంతమంది అమ్మాయిలు కామెంట్లు పెడుతున్నారు. నిన్న శృతీ హాసన్ బర్త్ డే సందర్భంగా ఇతని ఫోటో వెలుగులోకి వచ్చింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus