Shruti Hassan: శ్రుతి చేతిలో గ్లాస్‌ చూసి అదే అనుకుంటున్నారేమో!

  • August 19, 2021 / 02:55 PM IST

టాలీవుడ్‌ గ్లామర్‌ డాల్‌ శ్రుతి హాసన్‌కు ఇప్పుడు 35 సంవత్సరాలు అంటే ఎవరైనా నమ్ముతారా… ఇండస్ట్రీలోకి పదేళ్ల క్రితం అడుగుపెట్టిన శ్రుతి హాసన్‌కు, ఇప్పటి శ్రుతికి పెద్ద తేడా కనిపించదు. మధ్యలో కాస్త వయసు ఛాయలు కనిపించినా… ఆ తర్వాత మళ్లీ బ్యాక్‌ టు ఓల్డ్‌ లుక్‌కి వచ్చేస్తోంది. దీనికి వెనుక ఉన్న సీక్రెట్‌ ఏంటి అని అందరూ ఆమెను అడుగుతుంటారట. దాని వెనుక రీజన్‌ తాజాగా తెలిసింది. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ, సోషల్‌ మీడియాలో కూడా బిజీగా ఉంటూ వస్తోంది శ్రుతి హాసన్‌.

ఎప్పటికప్పుడు తన సొంత ఫొటోలు, భాయ్‌ఫ్రెండ్‌ శంతను హజారికా ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టింది. అందులో ఆమె చేతిలో ఓ డ్రింక్‌ గ్లాస్‌ కనిపిస్తుంది. దీంతో శ్రుతి వైన్‌ తాగుతోంది అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. తాజాగా వాటిపై శ్రుతి స్పందించింది. నేను తాగేది ఆల్కహాల్‌ కాదంటూ తొలుత క్లారిటీ ఇచ్చిన శ్రుతి… ఆ తర్వాత దానిపై ఆల్కలైన్‌ వాటర్‌ అని చెప్పింది.

ఇది తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని, చాలా రోజులుగా ఇదే తాగుతున్నానని చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్‌. ఇది తాగడం వల్ల వయసు మీద పడుతున్న ఛాయలు పెద్దగా ఉండవు అని కూడా చెబుతోంది. అయితే దీని వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని గతంలో వార్తలొచ్చాయి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus