టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతిహాసన్ పరిమితంగా సినిమాల్లో నటిస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ కు జోడీగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో శృతిహాసన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సంబంధించి శృతిహాసన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సలార్ లాంటి భారీ సినిమాలలో నటించడం వల్ల తన లాంటి హీరోయిన్లకు మేలు జరుగుతుందని శృతి తెలిపారు.
సలార్ లాంటి సినిమాల వల్ల చాలా రాష్ట్రాలలో పాపులర్ కావడంతో పాటు ఇతర భాషలలో కూడా పాపులర్ కావచ్చని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. సలార్ లాంటి సినిమాల వల్ల దేశమంతా మనల్ని చూస్తుందని ఈ రీజన్ వల్లే సలర్ లాంటి పాన్ ఇండియా సినిమాలను తాను వదులుకోనని శృతి పేర్కొన్నారు. ఇతర భాషల్లో సైతం పాన్ ఇండియా సినిమా ఆఫర్లు వచ్చినా వదులుకోనని శృతి వెల్లడించారు. శృతి మాట్లాడుతూ థియేటర్, ఓటీటీ మధ్య తేడాలను చెప్పుకొచ్చారు.
తాను థియేటర్ కు పెద్ద ఫ్యాన్ అని థియేటర్ లో సినిమా చూసే సమయంలో ఎవరైనా ఫోన్ మాట్లాడితే డిస్టర్బ్ అవుతానని శృతి తెలిపారు. ఆ సమయంలో మాత్రం ఓటీటీ బెటర్ అని ఫీల్ అవుతానని శృతి వెల్లడించారు. ఓటీటీలో సినిమా చూసే సమయంలో ఎవరూ డిస్టర్బ్ చేయరని శృతి పేర్కొన్నారు. కొన్ని పెద్ద సినిమాలను థియేటర్లలోనే చూడాలని ఆ సౌండ్, విజువల్స్ ను థియేటర్లలోనే ఆస్వాదించాలని శృతి చెప్పుకొచ్చారు. సలార్ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువే అయినా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని శృతి వెల్లడించారు.