త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న శ్వేతాబసు

  • November 29, 2018 / 07:36 AM IST

బాల్యనటి గా ఒక హిందీ సినిమా కి నేషనల్ అవార్డు పొందిన శ్వేతా బసు ‘కొత్తబంగారులోకం’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత రైడ్, కాస్కో లాంటి కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ సరైన సక్సెస్ లేక ముంబై కి వెళ్లిపోయింది. అక్కడ కూడా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం కొన్ని సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక డిసెంబర్ 13 వ తేదీన శ్వేతా బసు పెళ్ళికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది.

ఫిల్మ్‌మేకర్‌ రోహిత్‌ మిట్టల్‌ తో శ్వేతా బసు వివాహం డిసెంబర్ 13 వ తేదీన పుణేలో జరుగనుంది. ఆ తరువాత అదే వారంలో ముంబై లో రిసెప్షన్ ఉంటుందని సమాచారం. మార్వాడి, బెంగాలీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరుగుతుందని అంటున్నారు. ఇక శ్వేతా బసు తనకి కాబోయే భర్తతో, స్నేహితులతో కలసి ఇండోనేషియా, బాలిలో ప్రస్తుతం బ్యాచిలర్ పార్టీని ఎంజాయ్ చేస్తుంది. ఈ సందర్భంగా బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus