లాక్ డౌన్ సెక్స్ వర్కర్ల జీవితాలపై దెబ్బ కొట్టింది!
February 5, 2021 / 06:51 PM IST
|Follow Us
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్వేతా బసు ప్రసాద్. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఆమెకి అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ ఆమె నటించిన సినిమాలేవీ కూడా సక్సెస్ కాలేదు. దీంతో కొంతకాలానికి రోహిత్ మిట్టల్ ని పెళ్లి చేసుకుంది. కానీ ఏడాది తిరగకుండానే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ మధుర్ బండార్కర్ తెరకెక్కిస్తోన్న ‘ఇండియా లాక్ డౌన్’ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె సెక్స్ వర్కర్ మెహ్రునిస్సాగా కనిపించనుంది.
కోవిడ్ కారణంగా అన్ని రంగాలు ఎఫెక్ట్ అయిన సంగతి తెలిసిందే. ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలో నివసించే సెక్స్ వర్కర్లు కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇదే కాన్సెప్ట్ తో దర్శకుడు మధుర్ బండార్కర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీంతో సెక్స్ వర్కర్లు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి చిత్రయూనిట్ తో సహా శ్వేతా బసు కూడా రెడ్ లైట్ ఏరియాకు వెళ్లింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
తను చేసే పాత్రల్లో లీనమైతే కానీ.. ప్రేక్షకులు మమేకం కాలేరని.. తన పాత్ర బెటర్ గా రావడానికి రెండు వారాల క్రితం తన టీమ్ తో కలిసి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్లు చెప్పింది. అక్కడ వారి యాసను బట్టి ఎలా మాట్లాడాలో నేర్చుకున్నట్లు చెప్పింది. అంతేకాకుండా.. వారి ఆలోచనా విధానం, వారి జీవితాలేంటో తెలుసుకున్నట్లు వెల్లడించింది. లాక్ డౌన్ వారి జీవితాలపై కూడా పెద్ద దెబ్బ కొట్టిందని.. అక్కడకి వెళ్లి వారి గురించి తెలుసుకోవడం లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్గా నిలిచిందని వెల్లడించింది. అక్కడే మెహ్రునిస్సాను కలిసినట్లు.. తన పాత్రే కళ్లముందు కనిపించిందని చెప్పుకొచ్చింది.