సిద్దార్థ్, అదితి రావు హైదరి ప్రేమలో ఉన్నారా.. అనుమానాలు రేకెత్తిస్తున్న వీడియో..!
July 19, 2022 / 10:32 PM IST
|Follow Us
సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ‘బాయ్స్’ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగులో స్టార్ గా ఎదిగాడు సిద్దార్థ్. చెప్పుకోవడానికి తమిళనాడుకు చెందిన వ్యక్తే కానీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత కొన్ని స్ట్రైట్ తెలుగు సినిమాల్లో అతను నటించాడు.. అందులో ‘ఆట’ ‘ఓ మై ఫ్రెండ్’ వంటి చిత్రాలు కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. ‘బాద్ షా’ చిత్రంలో ఇతను గెస్ట్ రోల్ చేశాడు.
ఆ మూవీ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి తెలుగులో ‘మహాసముద్రం’ సినిమాలో నటించాడు. ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. అతని రీ ఎంట్రీకి ఈ చిత్రం బూస్టప్ ను ఇవ్వలేకపోయింది అనే చెప్పాలి. దర్శకుడు అజయ్ భూపతి ఇతని పాత్రని తీర్చిదిద్దిన విధానం కూడా బాలేదు. సో తప్పు సిద్దార్థ్ ది కాకపోవచ్చు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో అతనికి జోడీగా అదితి రావు హైదరి నటించింది. వీరిద్దరికీ రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.
ఈ చిత్రంతో వీరి మధ్య లవ్ ట్రాక్ కూడా మొదలైంది అని మొన్నటి వరకు కథనాలు వినిపించాయి. కానీ సెలబ్రిటీల పై అందులోనూ సినీ రంగానికి చెందిన వారిపై ఇలాంటివి కామన్ అని అంతా అనుకున్నారు. కానీ ఈరోజు ఈ జంట ఎవ్వరూ ఊహించని విధంగా ముంబైలో మీడియా కంట పడ్డారు.
అదితి, సిద్దార్థ్ లు ఒకే గదిలో నుండి బయటకు రావడం.. ఆ తర్వాత మీడియా వారు ఫోటోలు తీయడం.. సిద్ధార్థ్ వారి పై ఫైర్ అవ్వడం మనం గమనించవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి :