Siddhu: కెరీర్ గురించి ఆ ఇద్దరితో పోల్చుకున్న సిద్ధు!
February 19, 2022 / 10:44 AM IST
|Follow Us
సిద్ధు జొన్నలగడ్డ… ఇలా అంటే తెలుస్తుంది. అయితే డీజే టిల్లు అంటే టైమ్లీ ఉంటుంది. ఇటీవల ‘డీజే టిల్లు’గా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరిస్తున్నాడు. ‘గుంటూరు టాకీస్’లో హరి తర్వాత ఆ రేంజిలో సిద్ధుకి పేరొచ్చిన పాత్ర అంటే ఇదే. ఈ రెండు పాత్రలకు మధ్య చాలా ఏళ్ల గ్యాప్ ఉంది. అంతేకాదు దాని కోసం ఆయన పడ్డ కష్టమూ ఉంది. దీని గురించి సిద్ధు ఒకటి, రెండు సందర్భాల్లో మాట్లాడారు. తాజాగా సిద్ధు మరోసారి మాట్లాడాడు. అయితే ఈసారి మరో ఇద్దరు యువ హీరోల గురించి ప్రస్తావించాడు. దీంతో ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
‘గుంటూరు టాకీస్’కి ముందు సిద్ధు జొన్నలగడ్డ కొన్ని సినిమాలు నటుడిగా చేశాడు. ‘జోష్’, ‘ఆరెంజ్’, ‘భీమిలి కబడ్డీ జట్టు’ వంటి చిత్రాల్లో కాస్త గుర్తుండే పాత్రలే చేశాడు. ‘లైఫ్ బిఫోర్ వెడ్డింగ్’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇది జరిగింది 2013లో. ఆ తర్వాత సిద్ధు కొన్నిసినిమాలు చేసినా పెద్దగా పేరు రాలేదు. ‘గుంటూరు టాకీస్’తో 2016లో మెరిశాడు. ఆ తర్వాత కొన్నిసినిమాలు చేసినా అవి అనుకున్నంతగా ఆడలేదు.
‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘మా వింత గాధ వినుమా’ లాంటి చిత్రాలు ఊరటనిచ్చాయి. కష్టపడుతున్నా కుర్రాడికి హిట్లు లేవు అని అనుకుంటున్న సమయంలో ‘డీజే టిల్లు’ అనే సినిమా చేశాడు. అనేక అవాంతరాల తర్వాత ఈసినిమా ఇటీవల వచ్చి విజయం దక్కించుకుంది. సిద్ధు మంచి విజయం, మోస్తరు విజయాలు అందుకున్న సినిమాలకు కేవలం నటుడిగానే కాకుండా, రచనా విభాగంలో కూడా పాలుపంచుకున్నాడు. విజయం కోసం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఈ రోల్ కూడా ట్రై చేశా అని చెబుతాడు సిద్ధు.
‘గుంటూరు టాకీస్’ చిత్రం విడుదలై మంచి విజయం అందుకుంది. ఆతర్వాత నాకు ‘పెళ్ళి చూపులు’ తర్వాత విజయ్ దేవరకొండకు, ‘క్షణం’ తర్వాత అడవి శేష్‌కు వచ్చినట్లు నాకు సరైన అవకాశాలు రాలేదు అని చెప్పుకొచ్చాడు సిద్ధు. అందుకే తనకు ఇంత గ్యాప్ వచ్చిందని కూడా అన్నాడు. ఓ సినిమా గురించి తన ఫ్రెండ్‌ను ప్రచారం చేయమని అడిగాడట సిద్ధు. కానీ అతను చేయలేదట. అప్పుడే మనల్ని ఎవరూ పట్టించుకోనప్పుడు మనమే సంచలనంగా మారాలి అని ఫిక్స్ అయ్యాడట.