నాని సినిమాపై సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్ వైరల్!

  • October 22, 2022 / 11:34 AM IST

డీజే టిల్లు సినిమా సక్సెస్ తో సిద్ధు జొన్నలగడ్డ మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగిందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు2 సినిమాపై దృష్టి పెట్టారు. అన్ స్టాపబుల్ సీజన్2 సెకండ్ ఎపిసోడ్ కు హాజరైన సిద్ధు జొన్నలగడ్డకు బాలయ్య నుంచి ఏ రీమేక్ సరిగ్గా తీయలేదు అనే ప్రశ్న ఎదురు కాగా నాని హీరోగా తెరకెక్కిన ఆహా కళ్యాణం సినిమాను సరిగ్గా తీయలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఒరిజినల్ ఫ్లేవర్ ఇక్కడి ఫ్లేవర్ పూర్తిస్థాయిలో డిఫరెంట్ అని ఆహా కళ్యాణం మూవీ బాక్సాఫీస్ వద్ద కూడా వర్కౌట్ కాలేదని అనిపించిందని సిద్ధు జొన్నలగడ్డ చెప్పుకొచ్చారు. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన బ్యాండ్ బజా భారత్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కిందనే సంగతి తెలిసిందే. హీరో నాని సినీ కెరీర్ లో భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం.

బాలయ్య సార్ అడిగారు కాబట్టి నాని సినిమా నచ్చలేదని చెప్పానని సిద్ధు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కెరీర్ తొలినాళ్లలో బొమ్మరిల్లు సిద్దార్థ్ అనుకొని నాకు ఫోన్ చేసి కథ చెబుతామని అన్నారని సర్ అని పిలుస్తూ ఫోన్ చేసిన వాళ్లు ఎంతో గౌరవంగా మాట్లాడారని సిద్ధు చెప్పుకొచ్చారు. కథ చెప్పాలని అనుకుంటున్నామని నాతో చెప్పారని సిద్ధు కామెంట్లు చేశారు.

ఆ తర్వాత వాళ్లు నన్ను బొమ్మరిల్లు సిద్దార్థ్ అనుకుంటున్నారని తెలిసి ఫ్యూజులు ఎగిరిపోయాయని సిద్ధు వెల్లడించారు. నేను ఆ సిద్ధార్థ్ ను కాదని చెప్పగా ఆ తర్వాత అవతలి వ్యక్తి నుంచి కాల్ రాలేదని సిద్ధు జొన్నలగడ్డ చెప్పుకొచ్చారు. సిద్ధు జొన్నలగడ్డ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సిద్ధు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus