Siddu Jonnalagadda: చిరంజీవి సినిమాలో సిద్దు నటించకపోవడానికి అదే కారణమా?

  • July 12, 2023 / 07:28 PM IST

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోని చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ప్రస్తుతం అమెరికా వెకేషన్ లో ఉన్నటువంటి చిరంజీవి త్వరలోనే తిరిగి రానున్నారు.

ఇక ఈయన వచ్చిన వెంటనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ కానున్నారు. అనంతరం ఈయన తదుపరిశ్రమ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి.చిరంజీవి తన తదుపరిచిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాని చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా మలయాళంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి బ్రో డాడీ అనే సినిమాకు రీమేక్ చిత్రం అని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రలో నటించగా ఆయన కొడుకు పాత్రలో నటించడం కోసం టాలీవుడ్ యంగ్ హీరోని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ పాత్రలో నటించడం కోసం ఇప్పటికే (Siddu Jonnalagadda) సిద్దు జొన్నలు గడ్డ ఎంపికయ్యారు అంటూ ఓ వార్త ఇదివరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి సిద్దు జొన్నలగడ్డ తప్పుకున్నారని తెలుస్తుంది. ఈయన పలు సినిమాలతో బిజీగా ఉన్న కారణంతో డేట్స్ అడ్జస్ట్ కానీ నేపథ్యంలో తప్పుకున్నారని సమాచారం అయితే ఈ ప్రాజెక్టు నుంచి సిద్దు తప్పుకోవడంతో ఆయన స్థానంలో మరొ ఇద్దరు యంగ్ హీరోల పేర్లను తెరపైకి తీసుకువచ్చారు.

ఇందులో ఒకరు శర్వానంద్ కాక మరొకరు ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ. వీరిద్దరిలో ఒకరు ఈ సినిమాలో నటించే అవకాశం అందుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే చిరంజీవి మాత్రం తన ఫ్యాన్ బాయ్ అయినటువంటి కార్తికేయకు ఓటు వేశారని తెలుస్తోంది. ఇలా సిద్దు స్థానంలో కార్తికేయ ఈ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus