సిద్ధు మాట్లాడాల్సిందే.. అసలు విషయం చెప్పాల్సిందే!
December 2, 2022 / 01:03 PM IST
|Follow Us
‘డీజే టిల్లు’ సినిమా సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సినిమా కోసం ప్రోమో కూడా విడుదల చేశారు. దానిని ప్రత్యేకంగా షూట్ చేశారు అని కూడా అంటారు. అయితే ఆ విషయం పక్కనపెడితే.. ఈ సినిమాలో వరుసగా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. తొలుత దర్శకుడు మారారు, ఆ తర్వాత హీరోయిన్లు మారారు. దీంతో ఏం జరుగుతోంది అసలు, ఎందుకు టిల్లు ఇంతమందిని మారుస్తున్నాడు అనే ప్రశ్న వస్తోంది. అయితే దీనిపై త్వరలో టిల్లు మీడియా ముందుకు వస్తాడు అని అంటున్నారు.
2022 ప్రారంభంలో ‘డీజే టిల్లు’ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ సంచలనం రేపాడు. వసూళ్ల సంగతులు పక్కన పెడితే ‘డీజే టిల్లు’ క్యారెక్టర్ జనాల మీద చూపించిన ఇంపాక్ట్ చాలా ఎక్కువ. ఆ సినిమాలోని రాధిక అని టిల్లు అన్నప్పుడల్లా కుర్రాళ్లలో ఓ ఊపు కనిపించింది. ‘ఏయ్ బాబూ లేవ్’ అనే డైలాగ్ బాగా ఫేమస్. అయితే సీక్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఛేంజింగ్స్ ఇంకా ఎక్కువ ఫేమస్ అయ్యాయి. తొలుత దర్శకుడు విమల్ కృష్ణ మారి, మల్లిక్ రామ్ వచ్చారు.
హీరోయిన్గా నేహా శెట్టి స్థానంలో తొలుత అనుపమ పరమేశ్వరన్ వచ్చింది. ఆ తర్వాత ఆమె బదులు శ్రీలీల, మడోన్నా సెబాస్టియన్ అంటున్నారు. ఇలా మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. సిద్ధు జొన్నగడ్డ యాటిట్యూడ్ వల్లే ఒక్కొక్కరిగా సినిమా నుండి తప్పుకోవాల్సి వస్తోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని నిర్మాత నాగవంశీ సెటైరికల్ స్టయిల్లో ఖండించాడు. అయితే తన గురించి విపరీతమైన వ్యతిరేక ప్రచారం జరుగుతుండటంతో సిద్ధు ఈ వివాదాలపై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాడని సమాచారం.
త్వరలోనే ఓ ప్రెస్ మీట్ ఉంటుందని సమాచారం. ఇక సినిమా సంగతి చూస్తే.. ‘టిల్లు స్క్వేర్’ షూట్ జోరుగా జరుగుతోంది. వచ్చే మార్చిలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అయితే ఎప్పుడు ఉంటుంది, ఏం చెబుతాడు అనే చర్చ ఇప్పుడు సాగుతుంది. సిద్ధు ఇలాంటి విషయాల్లో చాలా క్లియర్గా ఉంటాడు. మరి ఏమైందనేది ఎలా చెబుతాడో చూడాలి.