Siddu: సిద్దు జొన్నలగడ్డ పై ఫోకస్ పెట్టిన టాలీవుడ్ నిర్మాతలు..!

  • February 16, 2022 / 02:34 PM IST

‘ప్రతీ శుక్రవారం ఓ హీరో పుడతాడు’ అంటూ అప్పట్లో దాసరి నారాయణ రావు గారు ఓ సందర్భంలో అన్నారు. అంతకు ముందు కూడా ఈ మాట చాలా మంది నోట్లో నుండీ వచ్చింది. అయితే ఆ టైంకి దాసరి నారాయణ రావు గారు ఫామ్లో ఉండడంతో ఆ మాట జనాల్లోకి బాగా వెళ్ళింది. సరిగ్గా ఇలాగే సడెన్ గా పాపులర్ అయిన హీరోలు కొంతమంది ఉన్నారు. ఈ లిస్ట్ లో చెప్పుకోవాలంటే విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి వంటి వాళ్ళ గురించి చెప్పుకోవాలి.

Click Here To Watch

వాళ్ళ మార్కెట్ పీక్స్ కు వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు కథల్ని ఎంపిక చేసుకోవడంలో చాలా పరిమితులు పెట్టుకుంటున్నారు కాబట్టి.. వాళ్ళు చిన్న సినిమాల చేతులు దాటిపోయినట్టే..! ఇలాంటి టైములో సిద్దు జొన్నలగడ్డ బంగారు బాతులా దొరికాడు మన టాలీవుడ్ నిర్మాతలకి..! ఇటీవల అతను హీరోగా వచ్చిన ‘డిజె టిల్లు’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అసాధారమైన కలెక్షన్లను నమోదు చేస్తుంది. ఫిబ్రవరి వంటి డ్రై సీజన్లో ఆ మూవీ ఈ రేంజ్లో కలెక్ట్ చేయడం అంటే మాటలు కాదు.

అంతేకాకుండా 2022 లో బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ను అందించే చిత్రమవుతుందని కూడా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సిద్దు కి మంచి మార్కెట్ కూడా ఏర్పడింది. దాంతో ఇతనితో సినిమాలు చెయ్యాలని దర్శకనిర్మాతలు ఎగబడుతున్నారు. నిజానికి సిద్దు కొత్త హీరో ఏమి కాదు..గతంలో హీరోగా ‘గుంటూరు టాకీస్’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాలు చేసాడు. అవి మంచి ఫలితాలనే అందించాయి.’జొష్’ ‘ఆరెంజ్’ ‘భీమిలి కబడ్డీ జట్టు’ ‘కల్కి’ వంటి చిత్రాల్లో కూడా ఈ హీరో నటించాడు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus