SIIMA: సైమా డైరక్టర్ బరిలో ఉన్నది వీళ్లే… ఎవరికి వస్తుందో అవార్డ్!
August 5, 2023 / 11:47 AM IST
|Follow Us
దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులను ఏటా సత్కరిస్తూ ఉంటుంది సైమా. ప్రతిభను గుర్తిస్తూ సాగుతున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) ఈ ఏడాది కూడా పురస్కారాలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్ వేదిక వేడుకను నిర్వహించనున్నారు. అందులో దక్షిణాదిలోని నాలుగు పరిశ్రమలకు చెందిన సినిమాల్లో నుండి ఉత్తమ సినిమా, నటుడు, నటి, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి పురస్కారం అందిస్తారు.
ఇప్పటికే ఉత్తమ చిత్రం తదితర అవార్డుల నామినేషన్లను ప్రకటించిన సైమా… ఇప్పుడు డైరెక్టర్ల జాబితా రిలీజ్ చేసింది. అంటే అవార్డు కోసం బరిలో నిలిచన దర్శకుల వివరాలను వెల్లడించింది. టాలీవుడ్ లిస్ట్‌లో రాజమౌళి (ఆర్ఆర్ఆర్), హను రాఘవపూడి (సీతారామం), చందూ మొండేటి (కార్తికేయ 2), శశికిరణ్ తిక్కా (మేజర్), విమల్ కృష్ణ (డీజే టిల్లు) పోటీలో ఉన్నారు. తమిళం నుండి చూస్తే… గౌతమ్ రామచంద్రన్ (గార్గి), లోకేశ్ కనగరాజ్ (విక్రమ్), ఎం మణికందన్ (కదైసై వివసాయి), మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్ 1), మిత్రన్ ఆర్ జవహర్ (తిరు) ఉన్నారు.
ఇక్కడ కన్నడ పరిశ్రమ నుండి చూస్తే.. అనూప్ భండారి (విక్రాంత్ రోణ), డార్లింగ్ కృష్ణ (లవ్ మాక్‌టైల్), కిరణ్‌రాజ్ కె (777 ఛార్లి), ప్రశాంత్ నీల్ (కేజీయఫ్ 2), రిషబ్ శెట్టి (కాంతార) ఉత్తమ దర్శకుడు పురస్కారం కోసం బరిలో నిలిచారు. మలయాళం నుండి అయితే… అమల్ నీరద్ (భీష్మ పర్వం), ఖాలిద్ రెహ్మాన్ (థల్లుమాల), మహేష్ నారాయణ్ (అరియిప్పు), తరుణ్ మూర్తి (సౌదీ వెల్లాక్క), వినీత్ శ్రీనివాసన్ (హృదయం) బరిలో నిలిచారు.
ఇక తెలుగు నుండి ‘ఆర్ఆర్ఆర్’ 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. 10 కేటగిరిల్లో ‘సీతారామం’ సినిమాకు నామినేషన్స్ దక్కాయి. తమిళంలో అత్యధికంగా ‘పొన్నియిన్ సెల్వన్-1’ చిత్రానికి 10 నామినేషన్స్ దక్కాయి. కమల్ హాసన్ – లోకేష్ కనగరాజ్ ‘విక్రమ్’కు 9 నామినేషన్స్‌ను వచ్చాయి. కన్నడలో ‘కాంతార’, ‘కేజీయఫ్ 2’ సినిమాలకు 11 కేటగిరిల్లో నామినేషన్స్ వచ్చాయి.