Simhadri: ఆ రకంగా చూస్తే ‘సింహాద్రి’ ఇండస్ట్రీ హిట్ కాదట..!
April 11, 2023 / 04:27 PM IST
|Follow Us
ఇప్పుడు రీ రిలీజ్ హవా నడుస్తుంది. పాత సినిమాలని డిజిటలైజ్ చేసి హీరోల పుట్టినరోజులకి రీ రిలీజ్ చేస్తున్నారు. ‘పోకిరి’ తో మొదలుపెట్టి మొన్నటికి మొన్న ‘దేశముదురు’ వరకు చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇదే క్రమంలో ఎన్టీఆర్ ‘సింహాద్రి’ మూవీ కూడా రీ రిలీజ్ కాబోతోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘సింహాద్రి’ ని రీ రిలీజ్ చేయబోతున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం (Simhadri) 2003 లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ‘సింహాద్రి’ ని ‘ఆల్ టైం ఇండస్ట్రీ హిట్’ గా పేర్కొంటూ రీ రిలీజ్ కు ప్రమోషన్ చేస్తున్నారు. ‘సింహాద్రి’ సినిమా ఇండస్ట్రీ హిట్టా కాదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘సింహాద్రి’ సినిమా 150 కేంద్రాల్లో 100 రోజులు, 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. 55 కేంద్రాల్లో డైరెక్ట్ గా 175 రోజులు ఆడిన సినిమాగా ‘సింహాద్రి’ చరిత్ర సృష్టించింది.
తర్వాత మహేష్ బాబు ‘పోకిరి’ సినిమా 63 కేంద్రాల్లో 175 రోజులు ఆడినా.. అందులో 48 కేంద్రాలే డైరెక్ట్ సెంటర్స్ ఉన్నాయి. షిఫ్ట్ లతో కలుపుకుంటే 63 అయ్యాయి. ఆ రకంగా ‘సింహాద్రి’ 175 రోజుల సెంటర్స్ రికార్డుని ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదు. అయితే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ‘సింహాద్రి’… ‘ఇంద్ర’ సినిమా కలెక్షన్లను అధిగమించలేదు. ‘ఇంద్ర’ కలెక్షన్లను అధిగమించిన సినిమా ‘పోకిరి’ మాత్రమే. ఇంద్ర సినిమా 110 కేంద్రాల్లో 100 రోజులు, 35 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.
ఎక్కువ రోజులు, ఎక్కువ కేంద్రాలు ఆడిన సినిమాగా ‘సింహాద్రి’.. ‘ఇంద్ర’ రికార్డుని బ్రేక్ చేసింది. అయితే ‘ఇంద్ర’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.28 కోట్ల వరకు షేర్ ను రాబడితే.. ‘సింహాద్రి’ సినిమా రూ.25 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బహుశా అందుకేనేమో ‘ఇంద్ర’ రికార్డులను బ్రేక్ చేసి ‘పోకిరి’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అంటారు కానీ.. ‘సింహాద్రి’ ‘ఠాగూర్’ వంటివి సినిమాలను ఇండస్ట్రీ హిట్లు అనరు. ‘ఠాకూర్’ కూడా 192 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.