Singer B Ramana: వేల పాటలు పాడిన ఒక్క అవార్డు రాలేదు!
April 27, 2023 / 06:20 PM IST
|Follow Us
సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సింగర్లు ఎన్నో అద్భుతమైన పాటలను పాడి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు ఈ క్రమంలోని నీ దారి పూల దారి.. పోవోయి బాటసారి,రేపటి పౌరులం ఆకతాయి చిన్నోడు వంటి ఎన్నో అద్భుతమైన పాటలను పాడిన సింగర్ బి రమణ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇలా తెలుగులో మాత్రమే కాకుండా వివిధ భాషలలో కూడా వేల పాటలు పాడినటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఎన్నో విషయాల గురించి ప్రస్తావించారు.
మాది విజయవాడ అని చిన్నప్పటినుంచి పాటలు అంటే ఎంతో ఇష్టం ఉండడంతో పెద్ద ఎత్తున పాటలు పాడుతూ ఉండే దానిని తెలిపారు.ఎక్కడికి వెళ్లినా పాట పాడి తాను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకునే దాన్ని సెకండ్ ప్రైజ్ అంటే అసలు ఒప్పుకునే దాన్ని కాదని ఈమె తెలియజేశారు. ఇలా ఎక్కడికి వెళ్లినా పాటలు పాడి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న తాను సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా కొనసాగుతూ కొన్ని వేల పాటలు పాడిన ఇప్పటివరకు తనకు ఒక్క అవార్డు కూడా రాలేదని కొంత పాటి అసహనం వ్యక్తం చేశారు.
ఇక (Ramana) నా గొంతు బాగుండడంతో సినిమా అవకాశాలు వచ్చాయని అయితే ఒకసారి ఘంటసాలగారు తన పాట విని తనకు రెమ్యూనరేషన్ కూడా పెంచమని చెప్పారని రమణ తెలిపారు. ఇక ఘంటసాల గారు ఎక్కడైనా కచేరీలకు వెళితే తనని కూడా వెంట తీసుకు వెళ్లేవారు అని తెలిపారు. ఇక దివంగత సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి మాట్లాడుతూ ఈమె ఎమోషనల్ అయ్యారు. బాలసుబ్రమణ్యం గారు కూడా తనని ఎంతో ఎంకరేజ్ చేశారని ఆయన ఎంతో మర్యాద ఇచ్చేవారని తెలిపారు.
బాలసుబ్రమణ్యం గారు చనిపోయినప్పుడు తనని చూడటానికి వెళుతున్నాను అని తెలిసి తనని చాలామంది వెళ్లొద్దని చెప్పారు అప్పుడు కరోనా అధికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వెళ్ళొద్దని చాలామంది తనకు సూచించారు. అక్కడకు వెళ్లేసరికి జనాలు చాలామంది ఉన్నారు అయితే వాళ్లంతా సింగర్లు కాదు తమిళులు. అయినా తాను రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళుతున్నాను ఎంత వెళ్లినా దారి అర్థం కాకపోవడంతో తాను కూడాఅందరితో పాటు లైన్లో వెళ్లాను అయితే తనని చూసి చాలామంది పెద్ద ఆవిడ సొమ్ము సుల్లి పడిపోయారంటూ ముందుకు పంపించారు కానీ ఆ క్షణం బాలు గారిని చూసేసరికి దుఃఖం ఆగలేదని ఈమె తెలియజేశారు.