నయనతార పై దారుణమైన కామెంట్స్ చేసిన నెటిజన్స్… మండిపడిన సింగర్ చిన్మయి!

  • December 25, 2022 / 04:21 PM IST

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే నయనతార సాధారణంగా తాను నటించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటారు.అయితే తన సొంత నిర్మాణంలో తెరకెక్కిన కనెక్ట్ సినిమాకు మాత్రం ఈమె పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఇక ఈ సినిమా ప్రీమియర్ షో చూడటం కోసం నయనతార తన భర్త, దర్శకుడు, నిర్మాత అయినటువంటి విగ్నేష్ శివన్ తో కలిసి కనెక్ట్ సినిమా ప్రీమియర్ షో చూడటానికి వచ్చారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.ఈ క్రమంలోనే కొందరు నేటిజన్లు నయనతార ఫోటోలు చూసిన అనంతరం తనపై బాడీ షేమింగ్ ట్రోల్స్ చేశారు.

ఇలా నయనతార గురించి నేటిజన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేయడంతో ఈ ట్రోల్స్ పై సింగర్ చిన్మయ శ్రీపాద స్పందిస్తూ తనదైన శైలిలో నేటిజనులకు కౌంటర్ ఇచ్చింది. ఈ సందర్భంగా చిన్మయి నయనతార విషయంపై స్పందిస్తూ ఇంట్లో తండ్రి సోదరులు ఉన్నప్పుడు ఒక తల్లి తన కూతురికి చున్ని వేసుకోమని చెప్పాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఎందుకంటే కొంతమంది పురుషులు ఇంట్లో తమ సోదరిని చూసిన వారి కోరికలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అంటూ కామెంట్ చేశారు.

నయనతార గురించి అలాంటి వల్గర్ కామెంట్స్ చేసిన వారిని చూస్తుంటే.. వీళ్లు అసలు తల్లిపాలు తాగారా లేదా అన్న సందేహం కలుగుతుంది అంటూ ఈమె నయనతార బాడీ షేమింగ్ ట్రోల్స్ గురించి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక ప్రస్తుతం చిన్మయి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags