Singer Kousalya: అనారోగ్యం పాలైన సింగర్ కౌసల్య.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

  • January 28, 2022 / 05:38 PM IST

ఈ మధ్య కాలంలో వరుస సినీ సెలబ్రిటీలు కరోనా భారిన పడుతున్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ల కంటే ఎక్కువగా థర్డ్ వేవ్ లో సినీ సెలబ్రిటీలు ఎక్కువగా కరోనా భారిన పడుతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. కరోనా భారిన పడి గతంలో కొంతమంది సినీ సెలబ్రిటీలు మరణించిన సంగతి కూడా తెలిసిందే. ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, శివశంకర్ మాస్టర్, టి.ఎన్.ఆర్ తో సహా మరికొంత మంది కరోనా కాటుకి బలైపోయారు.

ఇది పక్కన పడితే… థర్డ్ వేవ్‌లో చిరంజీవి, శ్రీకాంత్ వంటి వారు కరోనా సోకి చికిత్స తీసుకుంటూ ఉండగా.. తాజాగా ప్రముఖ టాలీవుడ్ సింగర్ కౌసల్య కూడా కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని ఆమె అధికారికంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ”తాజాగా కరోనా పరీక్ష చేయించుకుంటే రిజల్ట్ లో కరోనా పాజిటివ్ గా తేలింది. నా పై ఈ వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంది. రెండు రోజులగా జ్వరం వస్తూనే ఉంది.

ఇప్పుడు నేను బెడ్ పై నుండీ లేవలేని పరిస్థితుల్లో ఉన్నాను. గొంతు నొప్పి కూడా చాలా ఇబ్బంది పెడుతోంది. నిన్న‌టి నుండీ మెడిసిన్స్ తీసుకుంటున్నాను. త్వరలోనే కోలుకుని… పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను. మీరంతా జాగ్ర‌త్త‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ కౌసల్య చెప్పుకొచ్చింది. ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.’మీరు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మా ముందుకు రావాలని’ అభిమానులు, సెలబ్రిటీలు కోరుకుంటున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus