Madhu Priya: వాళ్లపై ఫిర్యాదు చేసిన మధుప్రియ.. ఏమైందంటే..?
May 22, 2021 / 02:31 PM IST
|Follow Us
ఆడపిల్లనమ్మా పాట ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో సింగర్ మధుప్రియ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న మధుప్రియ సినిమాల్లో సింగర్ గా అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు బుల్లితెర షోలు, ఈవెంట్లలో పాటలు పాడుతున్నారు. అయితే తాజాగా మధుప్రియ పోలీసులను ఆశ్రయించి వార్తల్లో నిలిచారు. ప్రేక్షకుల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న మధుప్రియ తనకు తరచూ బ్లాంక్ కాల్స్ వస్తున్నాయని పోలీసులను ఆశ్రయించారు.
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో మధుప్రియ హైదరాబాద్ షీ టీమ్స్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. మధుప్రియ చేసిన ఫిర్యాదును షీ టీమ్స్ సైబర్ విభాగానికి బదిలీ చేసినట్టు తెలుస్తోంది. అపరిచిత వ్యక్తుల నుంచి తనకు బ్లాంక్ కాల్స్ వస్తున్నాయని మధుప్రియ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ బ్లాంక్ కాల్స్ ఎవరు చేస్తున్నారు..? ఎందుకు చేస్తున్నారు..? అనే ప్రశ్నలకు పోలీసుల విచారణ తరువాత సమాధానం తెలిసే అవకాశం ఉంది.
తనకు బ్లాంక్ కాల్స్ చేసిన వాళ్ల ఫోన్ నంబర్ల వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులకు మధుప్రియ అందజేశారు. మధుప్రియ ఫిర్యాదుపై పోలీసులు 509, 354బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని సమాచారం. చిన్న వయస్సులోనే సూపర్ సింగర్ ప్రోగ్రామ్ లో పాట పాడటం ద్వారా మధుప్రియ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. నాలుగేళ్ల క్రితం భర్తపై, అత్తింటి వారిపై కేసు పెట్టి మధుప్రియ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.