ఆదివారం సాయంత్రం మీడియా, సోషల్ మీడియాలో ఒకటే చర్చ… ప్రముఖ గాయని మంగ్లీ కారు మీద బళ్లారిలో రాళ్ల దాడి జరిగింది అని. దీంతో ఏమైందా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు చాలామంది. ఆ మాట ఆ నోట, ఈ నోట ఆఖరికి మంగ్లీ దగ్గరకు వెళ్లింది. దీంతో ఆమె ఈ విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దాడి వార్తలను ఖండించిన మంగ్లీ అదంతా తప్పుడు ప్రచారమని చెప్పారు. తన ప్రతిష్టను కించపరచటానికి ఇదంతా చేస్తున్నారని తెలిపారు.
‘‘శనివారం రాత్రి బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో నాపై దాడి జరిగిందనే వార్తలను ఖండిస్తున్నాను. కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ మేరకు నా పై ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలను పూర్తిగా అబద్దం. ఈవెంట్ అంతా చక్కగా జరిగింది. నేను పాల్గొన్న ఉత్తమ ఈవెంట్‌లలో ఇదొకటి. నాపై కన్నడ ప్రజలు చూపించిన ప్రేమ, ఇచ్చిన మద్దతు చాలా గొప్పది. ఈవెంట్‌లో నన్ను అందరూ బాగా చూసుకున్నారు. ఇలాంటి సమయంలో నాపై దాడి జరిగిందంటూ అనడం నా ప్రతిష్టను కించపరచడానికి చేస్తున్న పనే’’ అని సోషల్ మీడియాలో మంగ్లీ రాసుకొచ్చారు.
బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో శనివారం బళ్లారి ఫెస్టివల్ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదటి రోజు ఉత్సవంలో మంగ్లీ, మరికొంతమంది గాయకులు పాల్గొన్నారు. మంగ్లీ తిరిగి వెళ్లేటప్పుడు ఆమెను చూసేందుకు స్థానిక యువకులు ఎగబడ్డారు. వేదిక వెనుక ఉన్న మేకప్ టెంట్ లోపలికి మంగ్లీ వెళ్లినప్పుడు అందులోకి కొంతమంది ప్రవేశించారని,
దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారని తొలుత వార్తలు వచ్చాయి.ఆ తర్వాత కార్యక్రమం నుండి మంగ్లీ తిరిగి వెళ్లిపోయేటప్పుడు కొంత మంది స్థానిక యువకులు ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారని ఆ వార్తల సారాంశం. అయితే అవన్నీ అవాస్తవమని ఇప్పుడు కొట్టిపారేశారు.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?