సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ గాయని కన్నుమూత!

  • June 15, 2023 / 11:36 AM IST

ఇటీవల సినీ ఇండస్ట్రీలో పలు విషాద సంఘనటు చోటు చేసుకుంటున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు, ఇంతర సాంకేతిక రంగానికి చెందిన వారు చనిపోవడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు అభిమానలు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వెండితెర, బుల్లితెర నటీనటులు, దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. తమ అభిమాన నటీనటులు చనిపోవడంతో కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది.. ప్రముఖ సింగర్ శారదా రాజన్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ ప్రముఖ గాయని శారదా రాజన్ (86) క్యాన్సర్ తో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చివరి శ్వాస విడిచారు. 1960లో శారదా సూరజ్ చిత్రంలో తొలిసారిగా నేపథ్యగానం చేసింది. ఆమె అసలు పేరు శారదా రాజన్ అయ్యంగార్. తమిళ కుటుంబంలో జన్మించిన ఆమె చిన్నప్పటి నుంచి ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కపూర్ నటించిన సూరజ్ మూవీలో ప్రముఖ సంగీత దర్శకులు శంకర్-జైకిషన్‌ తొలిసారిగా శారదా రాజన్ కి అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో తన గానంతో ప్రేక్షకులను మెప్పించారు.

శారదా రాజన్ ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో లతా మంగేష్కర్, ఆశా భోంస్లే మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆమె హిందీతో పాటు తెలుగు, మరాఠీ, గుజరాతీ భాషల్లో పాటలు పాడిమెప్పించారు. శారదా రాజన్ గుమ్నామ్ (1965), సప్నో కా సౌదాగర్ (1968) ఇతర చిత్రాలకు స్వరాన్ని అందించింది. అంతేకాకుండా, గరీబీ హటావో (1973), మందిర్ మసీద్, (1977) మైలా ఆంచల్ (1981) వంటి చిత్రాలకు కూడా సంగీతం అందించారు. జహాన్ ప్యార్ మిలే (1969)లోని క్యాబరే బాత్ జరా హై ఆపస్ కీ కోసం ఆమె ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.

బాలీవుడ్ ప్రముఖ సింగర్స్ మహమ్మద్ రఫీ, ఆశా భోంస్లే, కిషోర్ కుమార్, యేసుదాస్, ముఖేష్, సుమన్ కళ్యాణ్‌పూర్‌ లాంటి ప్రసిద్ధ కళాకారులతో కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. వైజయంతిమాల, సైరా బాను, హేమ మాలిని, షర్మిలా ఠాగూర్, ముంతాజ్, రేఖ, హెలెన్ లాంటి నటీమణులకు సూపర్ హిట్ సాంగ్స్ అందించారు. 1971లో విడుదలైన సిజ్లర్స్ అనే పాప్ ఆల్బమ్‌ను అక్కడ రికార్డ్ చేసిన భారతదేశం నుండి ఆమె మొదటి మహిళా గాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. శారదా రాజన్ కి సినీ ప్రముఖలు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus