అందంగా ఉండే సునీత అంతకంటే మధురంగా పాటలు పాడుతారు. తన గొంతులోని మాధుర్యంతో ఎంతో మందిని అలరించే ఈమె జీవితంలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఆ విషయాలను రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకొని సినీ పరిశ్రమలో ఉండే మహిళలకు ధైర్యాన్ని నింపారు. “నా వివాహ బంధం దెబ్బ తిన్నప్పుడు పడ్డ ఆవేదన కంటే.. ఇతరులు అనే మాటలు నన్ను చాలా బాధకు గురిచేశాయి. నేను ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటే నాపై విమర్శలు చేసేవారు హ్యాపీగా ఫీలవుతారు అని అనుకున్నాను. కానీ మరుక్షణమే నా కుటుంబం గురించి కూడా ఆలోచించాను.
వారి పరిస్థితి ఏంటి ? నాపై ఆధారపడ్డ వారిని కష్టాల పాలు చేయాలా ? అని ఆ మాటలను తట్టుకొని నిలబడ్డాను” అని వివరించారు. “మానసికంగా నేను చాలా దెబ్బతిన్నాను. ఇల్లు కూలిపోతే తేరుకుని మళ్లీ కట్టుకోవచ్చు .. కానీ మనసుకి దెబ్బ తగిలితే మాత్రం కోలుకోవడం చాలా కష్టం”అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. తీయని గొంతు వెనుక ఇంతటి చేదు ఉన్న సంగతి చాలామందిని కలిచి వేసింది. సూటిపోటి మాటలను ఎదురించి నిలబడడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.