Sunitha: సునీత పాటల్లో ఆ మ్యాజిక్‌ ఉందట… ఆటోమేటిగ్గా అదొచ్చేస్తుందట… అందుకే!

  • August 7, 2023 / 03:20 PM IST

‘ఈ వేళలో నీవు… ఏం చేస్తూ ఉంటావో…’ అంటూ ఎప్పుడో 28 ఏళ్ల క్రితం పాట పాడారు సునీత. అప్పటి నుండి ఆమె పాడుతూనే ఉన్నారు, శ్రోతలు విని ఆనందిస్తూనే ఉన్నారు. ఆమె మళ్లీ మళ్లీ పాడాలి అని కోరుకుంటూనే ఉన్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం సునీతను పాడొద్దు అన్నారట. ‘ఎవరా వ్యక్తి ఇటు పట్టుకురండి’ అంటారా? ఆగండాగండి ఆ మాట అన్నది ఎవరో కాదు. ఆమె తనయుడే. అవును ‘సర్కారు నౌకరి’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆకాశ్‌. ఇంతకీ ఏమైందంటే…

ఆకాశ్‌ నటించిన ‘సర్కారు నౌకరి’ సినిమా త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా సినిమా టీమ్‌ ప్రచారం షురూ చేసింది. అందులో భాగంగానే ఓ టీవీలో టీమ్‌ అంతా పాల్గొన్నారు. అక్కడ తన బిడ్డ గురించి, తన గురించి సునీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొడుకు కోసం సినిమాలో పాట కూడా పాడినట్టున్నావు అని సుమ స్టార్ట్ అడగ్గా… ‘‘పాట అంటే గుర్తుకొచ్చింది.. నేను ఈ సినిమాలో పాట పాడుతున్నాను అని తెలిసి, ఎందుకు పాడుతున్నావ్ అని నా కొడుకు నాతో వాదించాడు’’ అని చెప్పింది (Sunitha) సునీత.

అంతేకాదు పాడితే పాడావు గానీ.. హీరో హీరోయిన్లతో సంబంధం లేని పాట పాడు అని కండీషన్ పెట్టాడట ఆకాశ్‌. అంతే కాదు కారణం కూడా చెప్పాడు. సునీత పాడితే దానికి రొమాన్స్ చేయలేనని ఆకాశ్‌ అన్నాడట. దానికి సుమ కూడా కౌంటర్‌ వేసింది. ‘‘అసలే నువ్ పాడితే రొమాన్స్ లేని వాళ్లకి కూడా రొమాన్స్ వస్తుంటుంది’’ అని చిన్న పంచ్‌ ఇచ్చింది. ఆ విషయం చెప్పడానికి ‘చాలు చాలు’ పాటను చిన్నగా పాడి టీజ్‌ చేసింది సుమ.

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు నిర్మాతగా గంగనమోని శేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. భావనా వళపండల్ హీరోయిన్‌‌. 1996 కొల్లాపూర్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో అనౌన్స్‌ చేస్తారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus