Singer Sunitha: నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం అదే!

  • November 17, 2023 / 07:53 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ సునీత ఒకరు. ఈమె 17 ఏళ్ల వయసులోనే ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించడమే కాకుండా ఇండస్ట్రీలో దాదాపు హీరోయిన్స్ అందరికీ కూడా డబ్బింగ్ చెప్పారు. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ప్రస్తుతం సునీత ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

17 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చిన నేను కొన్ని కారణాలవల్ల 19 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకున్నాను అనంతరం పిల్లల పుట్టిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అయితే వాటన్నిటిని మర్చిపోయి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ముందడుగు వేశానని సునీత తెలిపారు. ఇక నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలను నేను మర్చిపోయాను నా బంధువులు ఆరోజు ఈ సంఘటన జరగడంతో చాలా బాగా ఏడ్చావు అని వాళ్ళు గుర్తు చేస్తే తప్ప నాకు గుర్తు లేవని అంతలా నేను ఆ విషయాలన్నింటిని మర్చిపోయి ముందడుగు వేశానని తెలిపారు.

ఇక తన గురించి ఎంతోమంది ఎన్నో విమర్శలు చేసేవారు. నేను నవ్వితే ఫేక్ అని విమర్శించేవారు. నా గురించి ఏదైనా చెప్పమన్నప్పుడు నాకు నచ్చకపోతే నేను నవ్వేసి వెళ్ళిపోతాను దానిని కూడా ఫేక్ అని విమర్శించేవారు. నా అనుకున్న వాళ్లే నన్ను చాలా మోసం చేశారని ఈమె ఎమోషనల్ అయ్యారు. ఇక నా గురించి నా వ్యక్తిగత విషయాల గురించి చాలామంది స్టూడియోలో మాట్లాడుకునే వారని వాటిని విన్నప్పుడు నేను చాలా బాధపడ్డానని ఏడ్చానని కూడా సునీత తెలిపారు.

గుడిలోకి వెళ్లేటప్పుడు చెప్పులు ఎలా అయితే బయట వదిలేసి వస్తామో స్టూడియోలోకి వచ్చేటప్పుడు కూడా నా వ్యక్తిగత విషయాలన్నింటిని మర్చిపోతాను. కానీ కొందరు మాత్రం నా జీవితం గురించి మాట్లాడే వారిని తెలిపారు. ఇక తాను జీవితంలో ఏదైనా మంచి నిర్ణయం తీసుకున్నాను అంటే అది రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడమే అంటూ ఈ సందర్భంగా (Sunitha) సునీత ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus