ఇంట్రెస్ట్ లేదంటూనే.. సెకండ్ మ్యారేజ్ కి రెడీ అయిపొయింది!
December 7, 2020 / 01:38 PM IST
|Follow Us
42 ఏళ్ల ఒంటరి స్త్రీ సునీత. ఇద్దరు పిల్లలతో ఇన్నాళ్లపాటు ఒంటరిగానే జీవించింది. కొన్నేళ్ల క్రితమే భర్త నుండి వేరుపడిన ఆమె ఇన్నాళ్లపాటు తన స్వశక్తితో పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఆమె అందాన్ని చూసి హీరోయిన్లు కూడా కుళ్ళుకోనేవారు. అన్నీ ఇబ్బందులను తట్టుకొని ఇన్నాళ్లపాటు నిశ్చలంగా ఉన్న సునీత ఈరోజు తన రెండో జీవితాన్ని ప్రారంభించింది. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ తో నిశ్చితార్ధం చేసుకొంది. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ వంటి వివరాలు తెలియవు కానీ.. దాంపత్య బంధానికి తెరలేపింది.
ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించింది అనేది తెలియాల్సి ఉండగా.. ప్రస్తుతం వారి ఎంగేజ్ మెంట్ ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. రామ్ కూడా డివోర్సీ కావడం గమనార్హం. సో, ఇద్దరికీ ఇది సెకండ్ ఇన్నింగ్స్. సునీత రెండో పెళ్లి గురించి గత కొంత కాలంగా రకరకాల కథనాలు వెలువడినప్పటికీ.. ఈ ఫోటోలతో వాటన్నిటికీ తెరపడినట్లే.
2020లో జరిగిన అతికొద్ది మంచి విషయాల్లో ఇదొకటి. సో, ఈ ఇద్దరూ కలిసి మొదలెడుతున్న ఈ కొత్త జీవితం సుదీర్ఘకాలం సుఖసంతోషాలతో కొనసాగాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు అవర్ ఫేవరేట్ & మోస్ట్ బ్యూటీఫుల్ తెలుగు సింగర్ సునీత. ఆ పెళ్లి ఎప్పుడో సునీత అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తే బాగుండు.