Sunitha: రెండో పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం బయటపెట్టిన సింగర్ సునీత!
May 15, 2023 / 01:14 PM IST
|Follow Us
తెలుగు సినిమా ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో సింగర్ సునీత ఒకరు. ప్రస్తుతం ఈమె రెండో పెళ్లి చేసుకుని తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. పెళ్లి వయసుకు వచ్చిన పిల్లలను ఇంట్లో పెట్టుకుని సునీత రెండో పెళ్లి చేసుకోవడంతో ఈమె పెళ్లి పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే సునీత పెళ్లి సమయంలో చాలా మంది ఈమె నిర్ణయం పట్ల ఎన్నో విమర్శలు చేశారు. ఇలాంటి విమర్శలను సునీత ఏమాత్రం పట్టించుకోకుండా తన జీవితంలో ముందడుగు వేశారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సునీత తన జీవితం గురించి జీవితంలో ఎదురైన కష్టాల గురించి చెప్పడమే కాకుండా తాను రెండో పెళ్లి చేసుకోవడానికి గల కారణాలను కూడా ఈ సందర్భంగా వివరించారు. ఇలా నా జీవితంలో జరిగే సంఘటనల గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు.కానీ సోషల్ మీడియాలో తన గురించి వచ్చే అసత్యపు వార్తలు వల్ల తాను తన సమస్యలను బయటకు చెప్పుకోవాల్సి వస్తుందంటూ ఈ సందర్భంగా సునీత తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేశారు.
నా (Sunitha) మొదటి భర్తతో విడిపోయిన తర్వాత నేను ఎన్నో కష్టాలను అనుభవించాను. పిల్లలను పెద్ద చేయడం కోసం వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తాను తన జీవితం గురించి మర్చిపోయానని సునీత తెలిపారు. కానీ ఒక వయస్సు వచ్చిన తర్వాత నేను ఎందుకో ఒంటరిగా మిగిలిపోయాను అనిపించింది. నా జీవితం మొత్తం పోయినట్టుగా అనిపించింది, ఆ సమయం రామ్ నాకు పరిచయమయ్యారని సునీత తెలియజేశారు.
ఇలా మా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది ఆ స్నేహం పెళ్లి వైపు అడుగులు వేసేలా చేసిందని అయితే పిల్లల నిర్ణయం మేరకు వారి ఇష్ట ప్రకారమే మా పెళ్లి జరిగింది అంటూ ఈ సందర్భంగా సునీత తన రెండో పెళ్లి గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈమె రామ్ వీరపనేని అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితం ఎంతో సంతోషంగా ఉందనే చెప్పాలి.