ప్రముఖ సింగర్ సునీత ఇటీవల వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇండస్ట్రీ నుండి కొందరు ప్రముఖులు ఈ వేడుకలో కనిపించారు. రామ్ తో కొత్త జీవితం మొదలుపెట్టడం తన అదృష్టమని అంటున్నారు సునీత. తాజాగా మీడియాతో మాట్లాడిన సునీత.. రామ్ తో పరిచయం, పెళ్లి, తన పిల్లల గురించి కొన్ని ఆసక్తిగా విషయాలను వెల్లడించారు. రామ్ తనకు చాలా ఏళ్ల నుండి తెలుసని.. తన సోషల్ మీడియా అకౌంట్స్ ని అతడే చూసుకునేవాడని చెప్పారు.
అలా ఏర్పడిన పరిచయం మరింత బలపడిందని.. ఆ బంధాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబ సభ్యులతో మాట్లాడి.. వారి అంగీకారంతో పెళ్లి చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. రామ్ తో పెళ్లి ఆలోచన వచ్చినప్పుడు ముందుగా తన పిల్లలే గుర్తువచ్చారని.. తను తీసుకునే నిర్ణయాలతో పిల్లలు ఇబ్బందిపడకూడదని అన్నారు. అలానే జీవిత భాగస్వామి చాలా ముఖ్యమని.. మన కష్టసుఖాల్లో అండగా నిలిచే వ్యక్తి దొరకడం ఎంతో అదృష్టమని.. రామ్ రూపంలో తనకు ఆ అదృష్టం దొరికిందని అన్నారు. చాలా కాలంగా ఇంట్లో రెండో పెళ్లి చేసుకోమని అడుగుతున్నా.. పిల్లల కోసం ఆ ఆలోచన చేయలేదని.. ఇప్పుడు పరిస్థితులను అర్ధం చేసుకునే పరిణితి వారిలో ఉందని అన్నారు.
రామ్ తో పెళ్లి గురించి పిల్లలతో చెప్పినప్పుడు వారు ఎంతో సంతోషించారని.. ఇంత బాగా అర్ధం చేసుకునే పిల్లలు లభించడం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. ఇక కోవిడ్ కావడంతో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోవాలనుకున్నామని.. కానీ ఇరు కుటుంబాలు పెద్దవి కావడంతో అతిథుల జాబితా 200కి చేరిందని అన్నారు. రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించడం లేదని.. కానీ చిన్న చిన్న పార్టీలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఇవ్వనీ పూర్తయిన తరువాత హనీమూన్ గురించి ఆలోచిస్తామని అన్నారు.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
More..
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
Most Recommended Video
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!