Sunitha: తనే బెస్ట్ ఫ్రెండ్ అంటూ అలాంటి ఫోటోలు షేర్ చేసిన సునీత!

  • July 11, 2023 / 09:28 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ గా ఎన్నో వందల పాటలు పాడి తన మధురమైన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు సీనియర్ సింగర్ సునీత. ఇలా ఇండస్ట్రీలో సింగర్ గా మాత్రమే కాకుండా ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఈమె పేరు సంపాదించుకున్నారు. ఇక సునీత గత రెండు సంవత్సరాల క్రితం రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈమెకు పెళ్లి వయసుకు వచ్చినటువంటి కొడుకు కూతురు ఉన్నప్పటికీ ఈమె రెండో పెళ్లి చేసుకోవడం పట్ల ఎంతోమంది విమర్శలు చేశారు.

అయితే కొందరు మాత్రం (Sunitha) ఈమె తీసుకున్న నిర్ణయం సరైనదేనని తనకు మద్దతుగా నిలిచారు. ఇలా ప్రస్తుతం సునీత తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో సునీత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా సునీత తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తనకు ఇండస్ట్రీలో ఇప్పటికీ ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనే విషయం గురించి తెలియజేశారు.

ఈ క్రమంలోనే తన బెస్ట్ ఫ్రెండ్ తో దిగినటువంటి ఫోటోలను ఈమె ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. మరి సునీతకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనే విషయానికి వస్తే.. ఇండస్ట్రీలో సునీతకు యాంకర్ సుమ బెస్ట్ ఫ్రెండ్ అని తెలియజేశారు.ఈ క్రమంలోనే సుమతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్ అంటూ కామెంట్ చేశారు.

ఇక వీరిద్దరూ కూడా పలు సందర్భాలలో కలుస్తూ పెద్ద ఎత్తున హంగామా చేస్తూ ఉండడం మనం చూస్తున్నాము. ఇక సునీత రెండో పెళ్లి సమయంలో సుమ పెద్ద ఎత్తున సందడి చేస్తూ కనిపించారు. ఇక సునీత కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన సర్కారు నౌకరి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus