Siri, Shanmukh: షణ్ముఖ్ కు ముద్దు పెట్టిన సిరి.. ఆమె బాయ్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్..!

  • November 27, 2021 / 07:22 PM IST

‘బిగ్ బాస్’ షో అన్నాక హగ్గులు ముద్దులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి.బిగ్ బాస్ నిర్వాహకులు కూడా వీటినే హైలెట్ చేస్తూ ఎపిసోడ్ లను డిజైన్ చేయించుకుంటారు. అలా అయితేనే టి.ఆర్.పి పెరుగుద్ది… హాట్ స్టార్ లో మళ్ళీ మళ్ళీ చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. సరే ఇక 5వ సీజన్లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో అందమైన అమ్మాయిలు అంతా ఎలిమినేట్ అయిపోయారు. సిరి మాత్రమే మంచి గ్లామర్ ను పంచగల కాంటెస్టెంట్ గా బిగ్ బాస్ కు కనిపిస్తుంది అనుకుంట.

షణ్ముఖ్ తో ఆమె ముద్దులు,హగ్గులు వర్షం కురిపిస్తూ ఓ రేంజ్ లో హాట్ టాపిక్ అవుతుంది. వీళ్ళిద్దరూ కూడా బయట రిలేషన్లో ఉన్నవారే. షణ్ముఖ్ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన దీప్తి సునైనా తో రిలేషన్లో ఉన్నాడు. ఇక సిరి.. శ్రీహాన్ తో రిలేషన్లో ఉంది. మొన్నటికి మొన్న సిరి తల్లి షణ్ముఖ్ కి ఓ స్ట్రోక్ కూడా ఇచ్చింది.మాటి మాటికీ హగ్గులు, ముద్దులు అంటూ అలా విర్రవీగిపోవడం సరైనది కాదు అని ఆమె పరోక్షంగా షణ్ముఖ్ కు వార్ణింగ్ ఇచ్చింది.

తాజాగా ఈ విషయం పై అలాగే సిరి, షణ్ముఖ్ ల వ్యవహారం పై శ్రీహాన్ తన ఇన్స్టా ద్వారా స్పందించాడు.’సిరి మథర్‌కి వీళ్ళ విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీక ఏదేదో అనేసింది. నిజానికి వాళ్లు ఉం‍టున్న వాతావరణం కూడా అలాంటిది.బయట తన కూతురి గురించి తప్పుగా మాట్లాడుకుంటే తట్టుకోలేక ఒక తల్లిగా అలా రియాక్ట్ అయ్యింది. ఆంటీ ఇలా అంటారని నేను కూడా అనుకోలేదు . దయచేసి ఆమె పై కోపం పెట్టుకోకండి… ఆమె తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. వాళ్ళ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని (సిరి, షణ్ముఖ్‌) నేను గౌరవిస్తాను’ అంటూ పేర్కొన్నాడు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus