Sita Ramam: సీతారామం సినిమాలో ఇంత మంచి సీన్ ఎందుకు డిలీట్ చేశారబ్బా!
September 7, 2022 / 08:14 PM IST
|Follow Us
దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతారామం. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ మలయాళ భాషలలో కూడా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని వసూళ్ల పరంగా కూడా భారీగా కలెక్షన్లను రాబట్టిందని చెప్పాలి.
ఒక అందమైన ప్రేమ కథగా తెరికెక్కిన ఈ సినిమాదక్షిణాది సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇకపోతే సెప్టెంబర్ రెండవ తేదీ ఈ సినిమా హిందీలో కూడా విడుదలై హిందీలో కూడా మంచి ఆదరణ సంపాదించుకుందని చెప్పాలి.ఇక ఈ సినిమా విడుదలై నెలరోజులు అవుతున్నప్పటికీ ఇంకా తెలుగులో ఈ సినిమాకు ఏ విధమైనటువంటి క్రేజ్ తగ్గలేదు.ఈ సినిమాతో నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా మరికొన్ని తెలుగు సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నట్లు సమాచారం.
ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి డిలీట్ చేసిన ఒక సన్నివేశాన్ని విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఎంతో అద్భుతమైన ఈ సన్నివేశాన్ని ఎందుకు డిలీట్ చేశారు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మన ఇండియాలో నివసించే వ్యక్తుల గొప్పతనాన్ని తెలియజేసినటువంటి ఈ సన్నివేశాన్ని డిలీట్ చేయడం వెనుక కారణం తెలియదు కానీ ఈ సన్నివేశం మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది.
ఈ సీన్ లో రష్మిక సీత మహాలక్ష్మిని వెతుకుతూ ఒక కాలేజీకి వెళుతుంది. ఈ క్రమంలోనే టాక్సీలో తన హ్యాండ్ బ్యాగ్ పాస్ పోర్ట్ మర్చిపోతుంది.అయితే కొద్దిసేపటికి తన బ్యాగు గుర్తు రావడంతో వెనక్కి తిరిగి వచ్చి క్యాబ్ డ్రైవర్ తో మాట్లాడుతూ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా.. ఇండియాలో నీలాంటి వాళ్లు కూడా ఉన్నారా అంటూ మాట్లాడుతుంది. ఆ మాటలకు క్యాబ్ డ్రైవర్ ఇండియాలో ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటారు.నీ బ్యాక్ నాతో పాటు తీసుకెళ్లి ఇండియా పరువును మీతో పాటు పంపించలేము కదా మేడం అంటూ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇలా దేశ ప్రజల గురించి వారి వ్యక్తిత్వం గురించి తెలియజేసే ఈ సీన్ ఎందుకు తొలగించారో తెలియదు కానీ ఈ సీన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది.