Sita Ramam Collections: 5వ రోజు కూడా మొదటి రోజుతో సమానంగా..రికార్డు కొట్టిన ‘సీతా రామం’!
August 10, 2022 / 11:42 AM IST
|Follow Us
దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ రాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామం’. ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.స్టార్ హీరోయిన్ రష్మిక మందన,దర్శకుడు తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్,భూమిక వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది.
ఇక ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో… పర్వాలేదు అనిపించే విధంగా కలెక్ట్ చేసింది కానీ ఆశించినంత కాదు. కానీ రెండో రోజు నుండి ఈ మూవీ బీభత్సం సృష్టించింది. నిన్న 5వ రోజు కూడా మొదటి రోజుతో సమానంగా కలెక్ట్ చేయడం ట్రేడ్ కు సైతం షాకిచ్చే అంశం.
ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
3.72 cr
సీడెడ్
1.01 cr
ఉత్తరాంధ్ర
1.40 cr
ఈస్ట్
0.85 cr
వెస్ట్
0.60 cr
గుంటూరు
0.74 cr
కృష్ణా
0.77 cr
నెల్లూరు
0.36 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
7.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.92 cr
ఓవర్సీస్
3.60 cr
మిగిలిన వెర్షన్లు
2.65 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
16.62 cr
‘సీతా రామం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.16.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.17 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.16.62 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ. 0.38 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. నిన్న అంటే మంగళవారం రోజు నాడు మొహరం సెలవు కలిసి రావడంతో మొదటి రోజుతో సమానంగా కలెక్ట్ చేసింది.కాబట్టి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్, మిగిలిన వెర్షన్ల పరంగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది.అయితే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇంకో రూ.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.