Sivaji: అమర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివాజీ.. టాప్3లో యావర్ అంటూ?

  • January 2, 2024 / 12:32 PM IST

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్7 బిగ్ బాస్ తెలుగు ఇతర తెలుగు సీజన్ల కంటే హిట్ గా నిలిచింది. బిగ్ బాస్ సీజన్7 విజేత శివాజీ అయ్యే ఛాన్స్ ఉందని కొంతమంది భావించినా పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. అయితే తను విజేతగా నిలవకపోయినా పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడం శివాజీకి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఒక ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ అమర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

బిగ్ బాస్ గేమ్ ఒక దశకు వచ్చిన తర్వాత విజేత ఎవరు? ఎవరెవరికి ఏ స్థానాలు దక్కుతాయి? అనేది అంచనా వేశానని నేను, ప్రశాంత్, యావర్ మొదటి మూడు స్థానాలలో ఉంటారని భావించానని ఆయన అన్నారు. అయితే ఊహించని ఒక వ్యక్తిని బిగ్ బాస్ హైలెట్ చేస్తూ వచ్చాడని శివాజీ అన్నారు. బిగ్ బాస్ కూడా అతడిని పొగడటం నాకు నచ్చలేదని ఆయన కామెంట్లు చేశారు. అమర్ దీప్ చపాతీ చేస్తే బాగుందని నాకు పంపించాలని బిగ్ బాస్ అన్నాడని శివాజీ చెప్పుకొచ్చారు.

నేను ఎంతో కష్టపడి వడలు చేయగా నాకు బిగ్ బాస్ నుంచి ఒక్క ప్రశంస కూడా దక్కలేదని ఆయన కామెంట్లు చేశారు. పలుసార్లు ఫౌల్ గేమ్ ఆడిన అమర్ దీప్ ను చివరకు రన్నరప్ చేశారని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పిదాల వల్ల బిగ్ బాస్ షో హోస్ట్ గా చేసిన నాగార్జునకు చెడ్డ పేరు వస్తుందని శివాజీ అన్నారు. ఇదే విషయం నాగ్ సార్ కు కూడా త్వరలో చెబుతానని ఆయన అన్నారు.

న్యాయంగా అయితే టాప్3లో నేను, ప్రశాంత్, యావర్ ఉండాలని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. (Sivaji) శివాజీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివాజీ కామెంట్ల గురించి బిగ్ బాస్ షో నిర్వాహకులు లేదా నాగార్జున స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్2 త్వరలో మొదలుకానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus