Sivaji: వైరల్ అవుతున్న బిగ్ బాస్ శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • December 31, 2023 / 12:49 PM IST

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్న శివాజీ ఈ షో తర్వాత కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. త్వరలో ఒక కొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న శివాజీ ఆ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా షాకింగ్ విషయాలను వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి కుటుంబానికి మంచి ఫాలోయింగ్ ఉందని ఆ కుటుంబానికి ఉన్న ఫ్యాన్ బేస్ మరే కుటుంబానికి లేదని శివాజీ తెలిపారు.

వాళ్ల కుటుంబం అనుకుంటే ముఖ్యమంత్రి కావడం పెద్ద కష్టమేమీ కాదని శివాజీ కామెంట్లు చేశారు. ఎక్కడో చిన్న లోపం ఉందని ఆ లోపాన్ని సరి చేసుకుంటే చాలని ఆయన కామెంట్లు చేశారు. యువత కోసం ప్రత్యేక హోదా అడిగాననని ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీలో లేనని నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉందని ఒంటరిగా ఎన్నాళ్లు పోరాడగలనని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల గురించి ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో అందుకు సంబంధించిన ప్రశ్నలు అడగాలని వెల్లడించారు.

మరోవైపు బిగ్ బాస్ శివాజీ (Sivaji) భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. శివాజీకి బిగ్ బాస్ షో ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. బిగ్ బాస్ షో ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి శివాజీ కారణమని చాలామంది ఫీలవుతారు. నెగిటివిటీ లేకుండా ఉండి ఉంటే శివాజీ బిగ్ బాస్ విజేతగా కచ్చితంగా నిలిచేవారని కామెంట్లు వ్యక్తమయ్యాయి. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడానికి శివాజీ కారణమని చాలామంది భావిస్తారు.

పల్లవి ప్రశాంత్ కు శివాజీ ఇచ్చిన సపోర్ట్ అతనికి హౌస్ లో ఎంతో ఉపయోగపడింది. మరోవైపు మెగా ఫ్యామిలీ గురించి ప్రస్తావిస్తూ శివాజీ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఏపీలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుండగా ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. 2024 ఏపీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus