Sivakarthikeyan: బయ్యర్లకు భరోసానిచ్చిన శివ కార్తికేయన్.. ఏం జరిగిందంటే..!
January 5, 2023 / 12:14 PM IST
|Follow Us
సినిమా ఫీల్డ్ అంటేనే అదో కలర్ ఫుల్ వరల్డ్.. వాళ్ల లైఫ్ స్టైలే వేరు అనుకుంటుంటారు కానీ ఎంత చెట్టుకి అంత గాలి.. ముఖానికి మేకప్ వేసుకునే వాళ్ల మనసుల్లో పైకి చెప్పుకోలేని బాధలు చాలానే ఉంటాయనేది చాలా మందికి తెలియదు.. స్టార్ల మధ్య, సినిమాల మధ్య ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ కష్టం వచ్చిందంటే మాత్రం అంతా ఒక్కటైపోతారు.. ఒక సినిమాకి నిర్మాత తండ్రి, దర్శకుడు తల్లిలాంటి వారంటుంటారు..
కోట్లాది రూపాయల పారితోషికాలు తీసుకునే హీరోలు, సినిమా సూపర్ హిట్ అయితే ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ తెచ్చుకునే వాళ్లు.. ఒకవేళ సినిమా పోయినా ఎలాంటి ఇబ్బందీ కలగని వాళ్లూ ఉంటారు కానీ ఓ సినిమా రిజల్ట్ విషయంలో తేడా కొట్టిందంటే మాత్రం ముందుగా రోడ్డున పడేది నిర్మాతే.. నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్లే.. వాళ్ల బాగుకోరుతూ గతంలో ‘బాబా’ డిజాస్టర్ అయినప్పుడు సూపర్ స్టార్ రజినీ కాంత్.. ‘జానీ’ పోయినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంపిణీదారులను ఆదుకున్నారు.
ఇప్పుడు తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ కూడా తన సినిమా ద్వారా నష్టపోయిన బయ్యర్లను ఆదుకుని తన మంచి మనసు చాటుకున్నాడు.. మిమిక్రీ కళాకారుడిగా, టెలివిజన్ యాంకర్‌గా పని చేసి అంచెలంచెలుగా ఎదిగి,తమళనాట తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న శివ కార్తికేయన్ తను హీరోగా నటించిన ‘ప్రిన్స్’ మూవీ కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తన వంతు సాయం చేశాడు.. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో..
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘ప్రిన్స్’ ఓపెనింగ్స్ రాబట్టుకున్నా, పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కానీ నష్టాలు రాకుండా మాత్రం ఆపలేకపోయింది.. రెండు చోట్లా దాదాపు రూ.12 కోట్ల మేర నష్టాలు రావడంతో.. అందులో సగం అంటే రూ.6 కోట్ల వరకు తన సొంత డబ్బు వెనక్కి ఇచ్చి డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్నాడట శివ. చిన్న హీరో అయినా ఆపదలో ఆదుకుని పెద్ద మనసు చాటుకున్నాడు అంటూ శివ కార్తికేయన్‌ని పొగుడుతూ పలు కోలీవుడ్ మీడియా సంస్థలు కథనాలు ప్రచారం చేస్తున్నాయి..