Sivakarthikeyan: సంక్రాంతి బరిలో శివ కార్తికేయన్ సినిమా కూడా..!

  • September 25, 2023 / 03:19 PM IST

2024 సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ , నాగార్జున నటిస్తున్న ‘ నా సామి రంగ ‘ , రవితేజ నటిస్తున్న ‘ ఈగల్ ‘ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇంకాన్ని తెలుగు సినిమాలు కూడా సంక్రాంతి సీజన్ పై కన్నేశాయి. పండుగల సీజన్లకి చాలా వరకు తెలుగు సినిమాలే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ సీజన్ లో డబ్బింగ్ సినిమాలకి థియేటర్లు సర్దుబాటు చేయడం అనేది కుదరదు.

కానీ ఒక క్రేజీ సినిమా 2024 సంక్రాంతి సీజన్ కి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే…శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘అయలాన్’ 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుందని మేకర్స్ ప్రకటించారు. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ బ్యానర్లపై కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

‘అయలాన్’ అంటే ‘ఏలియన్’ అని అర్థంమని తెలుస్తుంది. ఏలియన్ ఓ ప్రధాన పాత్రగా తీసుకుని దక్షిణాది భాషల్లో రూపొందుతున్న సినిమా ఇదే..!ఇషా కొప్పికర్, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫేమ్ శరద్ కేల్కర్, సీనియర్ హీరోయిన్ భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ వంటి వారు ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే నిజంగా ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి తెలుగులో రిలీజ్ చేస్తారా లేక పబ్లిసిటీస్టంట్ మాత్రమేనా ? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus