ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చిన 6వేల మంది అమ్మాయిలు
May 4, 2017 / 01:58 PM IST
|Follow Us
వర్షం సినిమాతోనే ప్రభాస్ అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. అప్పటి నుంచి సినిమాకి సినిమాకి ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అదే విధంగా డార్లింగ్ ని పెళ్లి చేసుకోవాలని ఆరాటపడే యువతుల సంఖ్య పెరిగింది. బాహుబలి తర్వాత పెళ్ళిచేసుకుంటాడని వార్త బయటికి రాగానే ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రభాస్‌కి ఏకంగా 6000 పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని తెలిసింది. కెరీర్ పైనే దృష్టి పెట్టిన ప్రభాస్ వారిలో ఏ ఒక్కరికీ ఓకే చెప్పలేదని సమాచారం.
ఇక బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పెళ్లి ప్రపోజల్స్ పెరిగిపోవడం ఖాయం. ఈ పెళ్లి ప్రపోజల్స్ తగ్గాలంటే.. ప్రభాస్ పెళ్లిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాల్సిందే. ప్రస్తుతం ‘సాహో’ చిత్రం పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పటికైనా పెళ్లి గురించి మాట్లాడకుంటే మరింతమంది అమ్మాయిలను బాధపెట్టిన వారవుతాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.