SJ Suriyah: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కే ఈ రేంజ్ పారితోషికమా.. మామూలు షాక్ కాదిది
October 25, 2023 / 11:25 AM IST
|Follow Us
ఎస్.జె.సూర్య.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో దర్శకుడిగా ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించాడు. ‘వాలి’ ‘ఖుషి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇతని ఖాతాలో ఉన్నాయి. అయితే తర్వాత ఇతను నటుడిగా మారడం జరిగింది. ‘స్పైడర్’ సినిమాలో ఇతను విలన్ గా నటించాడు. ఆ సినిమా ఆడలేదు కానీ ఎస్.జె.సూర్య విలన్ గా గుర్తుండిపోయే పెర్ఫార్మన్స్ చేశాడు. ఆ తర్వాత చేసిన ‘మెర్సల్'(అదిరింది) ‘మానాడు’ ‘డాన్'(తెలుగులో కాలేజ్ డాన్) వంటి సినిమాల్లో కూడా విలన్ గా నటించి మెప్పించాడు.
అయితే ఇటీవల వచ్చిన ‘మార్క్ ఆంటోనీ’ సినిమాలో విలన్ గా చేసినప్పటికీ సినిమా మొత్తం వన్ మెన్ షో చేసి దేశమంతా పాపులర్ అయిపోయాడు. ఈ సినిమాలో హీరో విశాల్ కంటే ఎక్కువ మార్కులు కొట్టేశాడు అనేది వాస్తవం. అందుకే ఇతనికి తెలుగు సినిమాల్లో కూడా ఛాన్సులు లభిస్తున్నాయి. నాని – వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో.. ‘అంటే సుందరానికీ!’ తర్వాత ‘సరిపోదా శనివారం’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. ‘స్పైడర్’ వంటి బైలింగ్యువల్ మూవీ తర్వాత తెలుగులో ఎస్.జె.సూర్య (SJ Suriyah) చేస్తున్న మూవీ ఇదే. ఈ సినిమా కోసం అతను భారీగా పారితోషికం అందుకుంటున్నాడట. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కోసం ఎస్.జె.సూర్య ఏకంగా రూ.8 కోట్లు పారితోషికం అనుకుంటున్నట్లు సమాచారం. తమిళ్ లో కూడా ఈ చిత్రానికి బిజినెస్ బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది