Game Changer: లక్కీ హ్యాండ్ గా మారుతున్న ఎస్జే సూర్య.. గేమ్ ఛేంజర్ కు తిరుగులేదా?
July 31, 2024 / 12:47 PM IST
|Follow Us
రామ్ చరణ్ (Ram Charan) దాదాపుగా రెండున్నరేళ్ల సమయం కేటాయించి నటించిన సినిమా గేమ్ ఛేంజర్ (Game Changer) కాగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఎస్జే సూర్య నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు హిట్లుగా నిలిచాయి.
స్టార్ హీరోలకు ఎస్జే సూర్య (S. J. Suryah) లక్కీ హ్యాండ్ గా నిలిచాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. డాన్ (Don) , మార్క్ ఆంటోని (Mark Antony) , జిగర్ తండా డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) , రాయన్ (Raayan) సినిమాలతో ఎస్జే సూర్య ఖాతాలో భారీ హిట్లు చేరాయి. ఎస్జే సూర్య ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాతో పాటు గేమ్ ఛేంజర్ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
గేమ్ ఛేంజర్ మూవీ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కగా ఈ సినిమాపై ఎంతోమంది కెరీర్ ఆధారపడి ఉంది. కియారా అద్వానీ (Kiara Advani) , శంకర్ (Shankar) కెరీర్ లకు ఈ సినిమా ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈ సినిమా కోసం ఏకంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాలో ట్విస్టులు ఊహించని స్థాయిలో ఉండనున్నాయని తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుండటంతో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సంక్రాంతి సెలవులను సైతం ఈ సినిమా కొంతమేర క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. గేమ్ ఛేంజర్ సక్సెస్ సాధించి ఈ ఏడాదికి పాజిటివ్ ఎండింగ్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj) కథ అందించారు.