Slum Dog Husband Review in Telugu: స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 29, 2023 / 12:03 PM IST

Cast & Crew

  • సంజయ్ రావు (Hero)
  • ప్రణవి మానుకొండ (Heroine)
  • బ్రహ్మాజీ, సప్తగిరి, 'ఫిష్' వెంకట్, మురళీధర్ గౌడ్, వేణు పొలసాని తదితరులు (Cast)
  • ఏఆర్ శ్రీధర్ (Director)
  • అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి (Producer)
  • భీమ్స్ సిసిరోలియో (Music)
  • శ్రీనివాస్ జె రెడ్డి (Cinematography)

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ హీరోగా ‘ఓ పిట్ట కథ’ తర్వాత చేసిన మూవీ ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ . చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు, ఆ తర్వాత సీరియల్స్ లో నటించి పాపులర్ అయిన ప్రణవి మానుకొండ ఈ చిత్రంలో హీరోయిన్. కుక్కతో హీరో పెళ్లి అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందింది. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ వంటివి సినిమా పై బజ్ ఏర్పడేలా చేశాయి. ‘బ్రో’ వంటి బడా సినిమా పక్కన తమ సినిమాను రిలీజ్ చేసుకోవడానికి చిన్న సినిమా మేకర్స్ సాహసించరు. కానీ ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ సినిమా యూనిట్ ఆ సాహసం చేయడంతో.. జనాల ఫోకస్ ఈ సినిమా పై పడింది అని చెప్పాలి. మరి సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :

కథ : పార్శీగుట్టకి చెందిన లచ్చి అలియాస్ లక్ష్మణ్ (సంజయ్ రావ్), మౌనిక (ప్రణవి మానుకొండ) గాఢంగా ప్రేమించుకుంటారు. ఇద్దరూ విరహవేదనతో పార్కులు, ఖాళీ బస్సులు వంటి వాటి చుట్టూ తిరుగుతారు. అయితే ఎక్కడా కూడా వీళ్ళకి ప్రైవసీ దొరకదు. దీంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. అయితే… వీరిద్దరికీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండదు. కాబట్టి జాతకాలు ఉండవు. అసలు జాతకాలు లేకుండా పెళ్లి చేసుకుంటే.. పొరపాటున ఇద్దరిలో ఎవరొకరి జాతకంలో కుజ దోషం వంటిది ఉంటే కుటుంబ సభ్యుల్లో ఎవరొకరు మరణిస్తారు? అని పంతులు హెచ్చరిస్తాడు.

దానికి పరిహారంగా చెట్టునో, కుక్కనో పెళ్లి చేసుకుంటే దోషం ఉండదని పంతులు పరిష్కారం చెబుతాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు(యాదమ్మ రాజు) మాటపై బేబీ (కుక్క)ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు.ధూమ్ ధామ్ గా వీరి పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాతి వారం లచ్చి – మౌనిక..లు పెళ్లి చేసుకోబోతుంటే పోలీసులు లచ్చిని అరెస్ట్ చేస్తారు? అంతేకాదు బేబీకి విడాకులు ఇచ్చి.. అలాగే భరణంగా రూ.20 లక్షలు చెల్లించి ఆ తర్వాత మౌనికని పెళ్లి చేసుకోవాలని చెబుతారు. విషయం కోర్టుకెక్కుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ తన మొదటి సినిమా కంటే తన పెర్ఫార్మన్స్ ను ఇంప్రూవ్ చేసుకున్నాడు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో ఇతను తన బెస్ట్ ఇచ్చాడు. హీరోయిన్ ప్రణవి మానుకొండ తన పెర్ఫార్మెన్స్ తో సర్ప్రైజ్ చేసింది.షార్ట్ ఫిలిమ్స్ కి, సీరియల్స్ కి మాత్రమే కాదు సినిమాల్లో కూడా మెయిన్ లీడ్ గా రాణించగలను అని ప్రూవ్ చేసుకుంది. ఆమె లుక్స్ బాగున్నాయి. పెద్దగా గ్లామర్ షో చేయకుండానే తన గ్లామర్ తో ఆకట్టుకుంది అని చెప్పొచ్చు.

అలాగే హీరోతో ఫోన్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో మాట్లాడుతూ ఈమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ యూత్ ను కట్టిపడేస్తాయి అని చెప్పొచ్చు. ఇక బ్రహ్మాజీ, సప్తగిరి, ఫిష్ వెంకట్ ఎప్పటిలానే తమ మార్క్ కామెడీతో ఆకట్టుకున్నారు. ఫ్రెండ్ రోల్ చేసిన యాదమ్మ రాజుకి.. ఫుల్ లెంగ్త్ రోల్ దొరికింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు ఏఆర్ శ్రీధర్ ఎంపిక చేసుకున్న లైన్ బాగుంది. ఐశ్వర్య రాయ్ కూడా చెట్టుని పెళ్లి చేసుకుంది అనే కొత్త విషయాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పాడు. మూఢనమ్మకాలు వంటి వాటి పై అతను వేసిన సెటైర్లు బాగున్నాయి. రొమాంటిక్ సీన్స్ తీయడంలో కూడా ఇతనికి మంచి పట్టు ఉన్నట్టు తెలుస్తుంది.ముఖ్యంగా హీరో, హీరోయిన్లు ఫోన్ లో మాట్లాడుకునే సీన్స్ మాస్ ను అలరిస్తాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతంలో రూపొందిన పాటలు బాగున్నాయి.

‘లచ్చి గాని పెళ్లి’ ‘మౌనికా ఓ మై డార్లింగ్’ ‘మేరే చోటా దిల్’ వంటి పాటలు హుషారెత్తించే విధంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ బాగుంది. బ్రహ్మాజీ, సప్తగిరి..లని లాయర్లుగా పెట్టి చేసిన కామెడీ ట్రాక్ బాగానే ఉంది.ఫినిష్ వెంకట్ ని జడ్జ్ గా పెట్టి చెప్పించిన ఇంగ్లిష్ డైలాగులు కూడా నవ్విస్తాయి. అయితే ఈ ట్రాక్స్ ఫస్ట్ లో కూడా ఉంటే ఇంకా బాగుణ్ణు అనిపిస్తుంది. శ్రీనివాస్ జె రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా హైలెట్ అని చెప్పొచ్చు.

విశ్లేషణ : ఓవరాల్ గా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపించినా సెకండ్ హాఫ్ ఎంటర్టైన్ చేస్తుంది. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది. ఈ వీకెండ్ కి ఒకసారి ట్రై చేయొచ్చు.

రేటింగ్ : 2.25/5

Click Here To Read in ENGLISH

Rating

2.25
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus