Diamond Ratnababu: ‘సన్ ఆఫ్ ఇండియా’ దర్శకుడు డైమండ్ రత్నబాబు షాకింగ్ కామెంట్స్ వైరల్..!
February 16, 2022 / 11:31 PM IST
|Follow Us
కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అయిన మోహన్ బాబు గారు.. ఫుల్ లెంగ్త్ హీరోగా నటించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. దేశ భక్తి కథాంశంతో రూపొందిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఫిబ్రవరి 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్’, ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించాడు. ఈయన చాలా చిత్రాలకి రైటర్ గా పనిచేసారు. డైరెక్టర్ గా బుర్రకథ అనే చిత్రం చేసినా అది ప్లాప్ అవ్వగా.. ‘సన్ ఆఫ్ ఇండియా’ అనేది రెండో చిత్రం కావడం విశేషం.
ఇదిలా ఉండగా.. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్ర బృందం. ఈ క్రమంలో దర్శకుడు డైమండ్ రత్నబాబు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ… “కరోనా టైములో నేను మోహన్‌బాబుగారిని కలిసి ఒక చిన్న ప్రయోగం చేద్దామని అడిగాను. గతంలో నేను ఓ ఫ్లాప్ సినిమా తీసినప్పటికీ ఆయన సంకోచించకుండా ఈ ప్రయోగం చేయడానికి అంగీకరించారు.ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ‘సన్ ఆఫ్ ఇండియా’ కథని ఓటిటి కోసమని ప్లాన్ చేసి గంటన్నర నిడివి ఉండేలా తీసాము.
కానీ థియేటర్లను ప్రేమించే వ్యక్తిగా మోహన్‌బాబుగారు ‘నాకు థియేటర్లంటే ఇష్టం ఓటీటీ మధ్య రిలీజ్ చెయ్యడం ఎందుకో అంతగా నాకు నచ్చదు’ అని నాతో అన్నారు. ఈ మూవీలో అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. ఈ సినిమా ఎలాగైనా థియేటర్లో రావాలని ఆయన కోరారు. క్లైమాక్స్‌లో కూడా పుణ్యభూమినాదేశం, రాయలసీమరామన్నచౌదరి వంటి పవర్ఫుల్ డైలాగులు పెట్టాము. మోహన్‌బాబు గారి పాత్రకి చిరంజీవిగారు వాయిస్ ఓవర్ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇళయరాజా లాంటి గొప్ప లెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి పని చేయడం కూడా నాకు హ్యాపీ అనిపించింది.
ఈ సినిమాలో ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ స్కూళ్ళ తరహాలో ఈ చిత్రంలోని హీరో ప్రైవేట్ జైలుని నడపడం విశేషం. అయితే ట్రైలర్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. క్లీనర్లు రేప్ చేస్తే ఎన్కౌంటర్ చేస్తారు. మరి రాజకీయనాయకులు చేస్తే కేసులు ఉండవా వంటి డైలాగులు కూడా ఈ చిత్రంలో చాలానే ఉంటాయి. వాటి వల్ల ఎటువంటి వివాదం తలెత్తినా మోహనబాబుగారు చూసుకుంటారనే ధ్యైర్యం నాకు ఉంది.ఆయన కూడా అదే అన్నారు” అంటూ చెప్పుకొచ్చాడు.